Children should be given a helping hand.......Wanaparthi Junior Civil Court Judge B. Srilatha
బాలల సంక్షేమానికి చేయూతనివ్వాలి…….వనపర్తి జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి బి. శ్రీలత
*సాక్షిత వనపర్తి *
బాలల సంక్షేమానికి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ చేతనివ్వాలని వనపర్తి జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి బి శ్రీలత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో న్యాయమూర్తి శ్రీలత ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు నీటి బాలలే రేపటి భావి భారత పౌరులని వారు అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి జరగాలని పిల్లలని విద్యావంతులుగా తీర్చిదిద్ది వారిని ఉన్నత శిఖరాలు ఎదిగాల చొరచూపాలన్నారు సమాజంలో బాలలు కార్మికులుగా ఉండరాదని బడికి వెళ్లి చదువు కొనేలా చొరవ చూపాలని మెరుగైన సమాజ నిర్మాణంలో పిల్ల లు తమ పాత్ర పోషించేలా ప్రభుత్వాలు తల్లిదండ్రులు విద్యావంతులు మేధావులు అవగాహన కల్పించాలని సూచించారు ఈ సందర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని జిల్లా సహాయ కార్మిక అధికారి వేణుగోపాల్ ఆర్డిఎస్ సంస్థ అధ్యక్షురాలు చెన్నమ్మ తామస్ లు మాట్లాడుతూ పిల్లలు బడులకు వెళ్లేందుకు తగిన ప్రణాళికలు అమలుపరచాలని అన్నారు. అనంతరం బాలలను తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేశారు
ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి రాంబాబు పోలీస్ అధికారి జయన్న న్యాయవాదులు బాల నాగయ్య ఉత్తరయ్య కృష్ణయ్య రఘు రియాజ్ నరేందర్ బాబు సిడబ్ల్యుసి కమిటీ సభ్యులు వనజ కుమారి లోక్ అదాలత్ సంస్థ సిబ్బంది సఖి కేంద్ర నిర్వాహకులు కవిత తదితరులు పాల్గొన్నారు.