శ్రీ చైతన్య లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
సాంస్కృతిక కార్యక్రమాలకు నిలయం శ్రీ చైతన్య
సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-
జగిత్యాల/వెల్గటూర్:
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో బాలల దినోత్సవ సందర్భంగా ఉదయం పూట చిన్నారులు ఉపాధ్యాయులుగా మారి చిన్నారులకు పాఠాలు బోధించారు. మధ్యాహ్నం భోజనం విరామం తర్వాత చిన్నారులు చేసిన సాంస్కృతిక నృత్యాలు చూపరు లను ఆకట్టుకున్నాయి. పాఠశాల కరస్పాండెంట్ బిడారి సతీష్ మాట్లాడుతూ చిన్నారులు వారి భయం పోగొట్టుకోవడానికి ఈ బాలల దినోత్సవం ఎందుకంటే పిల్లలు ఉపాధ్యాయులుగా మారి స్వయం పాలన దినోత్సవం జరుపుకోవడం జరిగింది, వారు పాఠశాలలోఈ రోజూ ప్రధానోపాధ్యాయులుగా సహస్ర, ఉపాధ్యాయులు అందరూ కలిసికట్టుగా పిల్లలకు చాలా చక్కగా నృత్యాలు నేర్పించారని, ఉపాధ్యాయులను కొనియాడారు. తదనంతరం బాలల దినోత్సవం సందర్భంగా పాల్గొన్న విద్యార్థులకు ఈరోజు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సహస్ర వారికి బహుమతులు అందజేశారు. చిన్నారులు చేసిన సాంస్కృతిక నృత్యాలు చూపరు లను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఎండి. శహిదోద్దీన్, వైస్ ప్రిన్సిపాల్ ఎ. జ్యోతి, రాజేష్, శ్రావణి, అంజలి, కార్తీక, సమత, మంజు భార్గవి, శ్రీలేఖ, మల్లీశ్వరి, వి. శిరీష, అనూష, మమత,జి. శిరీష, స్వప్న, సాహితి, వనజ, రజిత, అండాల్, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.