క్రాంతి ఫౌండేషన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు…
కోదాడ సూర్యాపేట జిల్లా నేటి బాలలే రేపటి భావిభారత పౌరులు.
భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదిన సందర్భంగా నిర్వహించే బాలల దినోత్సవం ఆనవాయితీను దానిలో భాగంగా సోమవారం కోదాడ మండల కేంద్రంలోని క్రాంతి ఫౌండేషన్ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ స్వపరిపాలన దినోత్సవం నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాపోలు శ్రీనివాసులు తెలిపారు. విద్యార్థులు ఉపాధ్యాయ వేషధారణలో పాఠ్యాంశాలు బోధించే తీరును వారు ప్రశంసించారు. నైతిక విలువలు నేర్చుకొని విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని , ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.