యూరో కిడ్స్ పాఠశాల వారి ఆధ్వర్యంలో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్….
పటాన్చెరు డివిజన్ పరిధిలోని యూరో కిడ్స్ పాఠశాల ప్రిన్సిపల్ మహేష్ ఆధ్వర్యంలో పటాన్చెరువు లోని ముదిరాజ్ భవనంలో జరిగిన బాలల దినోత్సవ వేడుకలో పటాన్చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న వారికి కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ చేతులమీదుగా జ్ఞాపికలను అందజేయడం జరిగింది.
కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు, అటువంటి పౌరులను తీర్చిదిద్దే గొప్ప దేవాలయాలు పాఠశాలలు అన్నారు.
భారత ప్రథమ ప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన ఎంతగానో ఇష్టపడే చిన్న పిల్లలకు గుర్తుగా బాలల దినోత్సవం జరపడం చాలా సంతోషకరమన్నారు. పిల్లలకు విద్యతో పాటు ఆట,పాటలు , సమాజం పట్ల బాధ్యత సమపాళ్లలో నేర్పించాలని కార్పొరేటర్ ఉపాధ్యాయులకు సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పటాన్చెరు కార్పొరేటర్ శంకర్ యాదవ్ ,
పాఠశాల ప్రిన్సిపాల్ మహేష్ వారి తండ్రి బుచ్చయ్య , ఉపాధ్యాయులు, పలువురు నాయకులు పాల్గొనడం జరిగింది.