SAKSHITHA NEWS

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు, ఎల్.ఓ.సిలు అందజేత.

మైలవరం నియోజకవర్గానికి తాజాగా రూ.34.92 లక్షల సిఎంఆర్ఎఫ్ చెక్కులు, రూ.9.30 లక్షల ఎల్.ఓ.సిలు మంజూరు.

లబ్ధిదారులకు చెక్కులను, ఎల్.ఓ.సీలను, సీఎం సందేశ పత్రాన్ని అందజేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు .

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం

మైలవరం నియోజకవర్గంలో 56 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి రూ.34.92 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. మరో 5 గురికి లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.ఓ.సి) కింద రూ.9.30 లక్షలు మంజూరయ్యాయి.

మైలవరంలోని శాసనసభ్యుని వారి కార్యాలయం మరియు, విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ఈ సాయాన్ని చెక్కులు, ఎల్.ఓ.సిల రూపంలో లబ్ధిదారులకు అందజేశారు. వీటితోపాటు సీఎం చంద్రబాబు సందేశ పత్రాలను కూడా లబ్ధిదారులకు అందజేశారు.

లబ్ధిదారులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి కోలుకున్న విధానం గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ అందరూ బాగానే ఉన్నారని, ప్రస్తుతం అందిస్తున్న సాయంతో తమకు మరింత భరోసా కల్పించినట్లు అవుతుందన్నారు. కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు కి, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు కి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబునాయుడు సారథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి అనతికాలంలోనే సాయం మంజూరు అవుతుందన్నారు. అనారోగ్యానికి గురి ఆసుపత్రులలో చికిత్సలు చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సాయం మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని వారికి సూచించారు.

రెడ్డిగూడెం మండలంలో 10 మందికి రూ.4.63 లక్షలు, మైలవరం మండలంలో 13 మందికి రూ.10.47లక్షలు, జి.కొండూరు మండలంలో 17 మందికి రూ.7.84 లక్షలు, కొండపల్లి మున్సిపాలిటీలో 5 గురికి రూ.2.80 లక్షలు, ఇబ్రహీంపట్నం మండలంలో 6 గురికి రూ.6.88 లక్షలు, విజయవాడ రూరల్ మండలంలో 5 గురికి రూ.2.28 లక్షలు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరయ్యాయి. నియోజకవర్గంలో ఎల్.ఓ.సి నుంచి 5 గురికి రూ.9.30.లక్షలు మంజూరయ్యాయి. ఈ కార్యక్రమాల్లో ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS