ముఖ్యమంత్రి వాహన కాన్వాయ్ ట్రయల్ రన్
** భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించిన ఎస్పీ సుబ్బరాయుడు
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. ఈ క్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమలకు రానున్నారు.
ఈ నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయం నుంచి భారత ఉప రాష్ట్రపతి, రాష్ట్ర ముఖ్యమంత్రిల తిరుమల వరకు వాహన కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
భద్రతా ఏర్పాట్లు:
రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుపతి నగరం మీదుగా తిరుమల వరకు మొత్తం మార్గంలో భద్రతా కవచం ఏర్పాటు చేశారు.
ఘాట్ రోడ్లలో ప్రత్యేక పోలీస్ పార్టీలు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లు, డాగ్ స్క్వాడ్‌లు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. శేషాచల అరణ్యంలో అడవి ప్రాంతాలను సిబ్బంది జల్లెడ పట్టి పరిశీలించారు.
మార్గమధ్యంలోని వంతెనలు, వాకిలీలు, భక్తుల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాలలో యాంటీ సబొటాజ్ చెకింగ్ నిర్వహించారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల సహాయంతో కాన్వాయ్ మార్గాన్ని నిరంతరం పర్యవేక్షించారు. ట్రాఫిక్ పోలీస్ విభాగం వాహనాల కదలికలపై ప్రత్యేక నియంత్రణ విధించి, కాన్వాయ్ సమయాల్లో వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు.
అత్యవసర పరిస్థితుల్లో స్పందించడానికి రెస్క్యూ టీములు, వైద్య బృందాలు, అగ్నిమాపక సిబ్బంది సిద్ధంగా ఉంచబడ్డారు.
జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఎటువంటి లోపం చోటు చేసుకోకుండా పోలీసులు పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని, భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి రాకపోకలు సాఫీగా జరిగెలా ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు.
