డ్వాక్రా డబ్బులు స్వాహా చేసిన డ్వాక్రా బుక్ కీఫర్ వసంత

Sakshitha news

డ్వాక్రా డబ్బులు స్వాహా చేసిన డ్వాక్రా బుక్ కీఫర్ వసంత

సాక్షిత : భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో డ్వాక్రా బుక్ కీఫర్ వసంత తమ డబ్బును స్వాహా చేసిందని మహిళలు ఆరోపిస్తున్నారు. ఆమె ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ప్రతినెల ఒక్కో గ్రూపు నుంచి రూ. 5,96,500.చొప్పున వసూలు చేసి బ్యాంకులో జమ చేయలేదని ఆరోపించారు. రుణం కోసం బ్యాంకుకు వెళ్ళగా నెలవారి డబ్బు కట్టడం లేదని అధికారులు చెప్పడంతో వారు విస్తుపోయారు.అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డ్వాక్రా మహిళలు కోరుతున్నారు.