SAKSHITHA NEWS

చటాన్ పల్లి బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయాలి

ఎన్ హెచ్ 44కు అదనపు ఫ్లయ్ ఓవర్ ను మంజూరు చేయాలనీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికీ వినతి

వెంటనే స్పందించి రైల్వే రైల్వే జీఎంను అదేశించిన కిషన్ రెడ్డి

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి

చటాన్ పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ఆగిపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయాలనీ అదేవిదంగా ఎన్ హెచ్ 44కు వెళ్ళడానికి రైల్వే గేట్ దగ్గర అదనంగా మరొక ఫ్లై ఓవర్ ను మంజూరు చేయాలనీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డికి విన్నవించారు. సికింద్రాబాద్ రైల్వే నిలయంలో జరిగిన సమావేశంలో శ్రీ వర్ధన్ రెడ్డి లేఖను అందజేశారు. కిషన్ రెడ్డి వెంటనే స్పందించి రైల్వే జిఎంను అదేశించారనీ వీడియోకు తెలిపారు.


ఈ సందర్బంగా నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. చటాన్ పల్లి బ్రిడ్జి పనులను ఆపడంతో ప్రజలు ఎన్నో రోజులుగా నానా అవస్థలు పడుతున్నారని అన్నారు.
త్వరగా బ్రిడ్జి పనులను పూర్తి చేయాలనీ అదేవిదంగా ఎన్ హెచ్ 44 కు వెళ్ళడానికి అదనంగా ఫ్లై ఓవర్ ను ప్రారంభించాలని అన్నారు.
ఈ అంశాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తే వారు వెంటనే స్పందించి రైల్వే జిఎంకు అదేశించారనీ పేర్కొన్నారు. ఈ సందర్బంగా బ్రిడ్జి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అనుమతులను ఇస్తే వెంటనే నూతన ఫ్లై ఓవర్ పనులను ప్రారంభిస్తామని రైల్వే అధికారి అన్నారని శ్రీవర్ధన్ రెడ్డి తెలిపారు.. కేపి


SAKSHITHA NEWS