ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాత జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ తేజ
….
సాక్షిత చిలకలూరిపేట:ధర్మం వర్ధిల్లాలని, సమాజంలో రామరాజ్యం స్థాపించబడాలని కోరుకుంటూ జనసేన పార్టీ నియోజకవర్గ యువ నాయకులు మండలనేని చరణ్ తేజ నియోజకవర్గ ప్రజలకు, జనసైనికులకు మరియు వీరమహిళలకు శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుని అడుగుజాడల్లో నడవడమే మనం ఆ స్వామికి ఇచ్చే నిజమైన గౌరవమని పేర్కొన్నారు. సత్యం, ధర్మం, క్రమశిక్షణతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా, ప్రజలందరికీ ఆ సీతారాముల ఆశీస్సులు మెండుగా ఉండాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు
