ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు…!
సాక్షిత పెద్దపల్లి//ఓదెల :
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా మండల కేంద్రంలోని ప్రసిద్ధ గాంచిన పుణ్యక్షేత్రం ఓదెల శ్రీ మల్లికార్జున స్వా మి, వారి ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది స్వామి వారి కల్యాణ మహోత్స వాన్ని తిరస్క రించుకొని ఆలయంలో అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజ కార్యక్రమా లు ఘనంగా నిర్వహించారు.

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ఆవరణలో శ్రీ సీతారాము ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. కళ్యా ణ వేడుకల నేపథ్యంలో ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అత్యంత సుందరంగా అలంకరించారు.
ఈ వేడుకల్లో భాగంగా ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సతీమణి చింతకుంట పావని స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాల ను సమర్పించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఈవో సదయ్య, ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్యలతో కలిసి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు.
SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
