నేతన్నల పెన్నిధి చంద్రన్న : ప్రత్తిపాటి
- సాక్షిత : టీడీపీ పాలన నేతన్నలకు స్వర్ణయుగం : ప్రత్తిపాటి
- నేతన్నలు తన ప్రాణసమానులన్న వ్యాఖ్యలకు లోకేశ్ కట్టుబడ్డారు : ప్రత్తిపాటి
నేతన్నల ప్రతిభను మెరుగుపరిచేలా చంద్రబాబు పలుసంస్కరణలు ప్రవేశపెట్టారు
“ మారుతున్న కాలానికి అనుగుణంగా తమ నేతపనితో ప్రజల మనసులు గెలుస్తూ, కష్టాన్ని నమ్ముకొని బతికే నేత కార్మికుల సంతోషమే ధ్యేయంగా కూటమిప్రభుత్వం పనిచేస్తోంది. నేత పనివార్ల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా టీడీపీ అనేక పథకాలు ప్రకటించింది. స్వర్గీయ ఎన్టీఆర్ పేదలకు జనతా వస్త్రాల పంపిణీ చేపట్టి..నేత కార్మికులకు చేతినిండా పని కల్పించారు. చంద్రబాబు పాలన నేతన్నలకు స్వర్ణయుగమనే చెప్పాలి. నేతన్నల పెన్నిధిగా నిలిచిన చంద్రబాబు.. వారిలోని ప్రతిభాపాటవాలను ప్రోత్సహించేదిశగా గతంలోనూ.. ఇప్పుడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నేతన్నల జీవనోపాధి మెరుగుపరిచే దిశగా పలు సంస్కరణలు అమలు చేశారు. పనిభారంతో అనారోగ్యం పాలయ్యే నేత పనివార్లకు పింఛన్ అందిస్తున్నారు. కేవలం ఒక్క నేత కార్మికుల కోసమే చంద్రబాబు హాయాంలో 26 పథకాల వరకు అమలు చేయడం జరిగింది. వాటికి కొనసాగింపుగా 11 జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని నేతన్నల సంక్షేమం కోసం రూ.5కోట్లతో త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. మగ్గాల నిర్వహణకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వినియోగానికి వెసులుబాటు కల్పించారు. చేనేత వస్త్రాలపై కేంద్రప్రభుత్వం విధించేజీఎస్టీని రాష్ట్రప్రభుత్వమే భరిస్తుందని నేతకార్మికులపై ఆ భారం పడనివ్వమని ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం తర్వాత అధికమందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగం సమస్యల పరిష్కారానికి, కార్మికుల సంక్షేమానికి తమప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందన్న ముఖ్యమంత్రి ప్రకటన నిజంగా అభినందనీయం.. సదా హర్షణీయం.
నేతన్నలు తనకు ప్రాణసమానులన్న వ్యాఖ్యలకు లోకేశ్ కట్టుబడ్డారు
రాష్ట్ర చేనేత ఉత్పత్తులకు 10 జాతీయ అవార్డులు లభించడంతో పాటు, అంతర్జాతీయ స్థాయిలో పలు ప్రశంసలు దక్కాయి. అందుకు కారణం నేతన్నల నైపుణ్యం.. సరికొత్త ఆలోచనలతో కూడిన కళంకారీ పనితనం. రాష్ట్రంలో లక్షల కుటుంబాలు నేత పనిపై ఆధారపడి బతుకుతున్నాయి. మంగళగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, తన ప్రాంతంలోని నేతన్నల అభ్యున్నతికి అన్నివేళలా అండగా నిలుస్తున్నారు నేతన్నలు తనకు ప్రాణసమానులన్న వ్యాఖ్యలకు కట్టుబడి అన్నివేళలా వారి సంక్షేమం…సంతోషం కోసం పనిచేస్తున్నారు. కరోనా సమయంలో ఉపాధిలేక బతుకుదెరువు కష్టమైన నేత కుటుంబాలకు నిత్యావసరాలు అందించారు. మంగళగిరి నేత కార్మికుల పనితీరుకు మచ్చుకైన వస్త్రాలను స్వయంగా ప్రధాని మోదీకి అందించిన లోకేశ్.. తన నియోజకవర్గం పరిధిలోని నేతన్నల సంక్షేమానికి అండగా నిలవాలని ప్రధానిని కోరారు. ప్రజాప్రతినిధులు విధిగా నేతవస్త్రాలు ధరించాలని చెప్పడం ద్వారా నేత పనికి మంచి గుర్తింపు లభించేలా చేశారు” అని మాజీమంత్రి ప్రత్తిపాటి ఒక ప్రకటనలో తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
