హస్తినాపురం డివిజన్ లోని ఖాద్రీ కాలనీ నాయకుల పిలుపు మేరకు

Sakshitha news

హస్తినాపురం డివిజన్ లోని ఖాద్రీ కాలనీ నాయకుల పిలుపు మేరకు మాజీ కార్పొరేటర్ పద్మాశ్రీనునాయక్ కాలనీ నాయకులతో కలిసి కాలనీ లో నెలకొన్న సమస్యలపై పర్యటించారు. గత BRS ప్రభుత్వంలో LB నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సహకారంతో కాలనీలో 2 కోట్ల 27 లక్షల రూపాయలతో వాటర్ పైప్ లైన్లు, 25 లక్షల రూపాయలతో BTరోడ్, డ్రైనేజ్‌ లైన్లు, 100 విద్యుత్ స్తంభాలు, లైట్లు, 2 ట్రాన్సఫార్మ్ లు కాలనీలో ఉన్న సమస్యలను పరిష్కరించడం జరిగింది. ఇపుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టించుకోనీ ప్రజాప్రతినిధులు మరియు అధికారులు కాలనీ లో అసంతృప్తి (పెండింగ్‌)లో ఉన్న CC రోడ్లను MLA సిఫార్సు చేసిన కూడా ZC మంజూరు చేయకుండా 1 సంవత్సరం నుంచి కాలయాపన చేస్తున్నారు. అలా చేయకుండా CC రోడ్ల టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాము.అలాగే కాలనీలో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సత్యంచారి గారు,సయ్యద్ పాషా, గోపాల్ నాయక్‌, మహమోద్, జమీర్, అబ్బాస్, కాలనీ వాసులు పాల్గొన్నారు.