అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వ బరకాతుహు
ముస్లిం సోదర, సోదరీమణులకు పవిత్ర ‘రంజాన్ మాస’ శుభాకాంక్షలు
ఆధ్యాత్మికంగా ప్రత్యేక ప్రార్థనలు, కఠిన ‘రోజా’ ఉపవాస దీక్షలు, దానధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో రంజాన్ మాసం సాగుతుంది. మహమ్మద్ ప్రవక్త ప్రస్తావించిన ప్రకారం ఉపవాస దీక్షలతో ప్రజల మధ్య ప్రేమాభిమానాలు, క్రమశిక్షణ, సహనం, ధాతృత్వం, పవిత్ర జీవనం, ఆర్థిక సమానత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం తదితర ఉత్తమ గుణాలు అలవడతాయి. చెడు కార్యాలు, అన్యాయం, అధర్మం మనసులోకి రానివ్వకుండా పాప క్రియల నుంచి దూరంగా ఉంటూ ‘అల్లాహ్’ స్మరణ చేస్తూ తనకు తాను అంతర్గతంగా ఆత్మ ప్రక్షాళన చేసుకోవడమే. రంజాన్ మాస ప్రత్యేకత.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు , పార్టీ ముఖ్య నాయకులు పాల్గొంటున్న ఇఫ్తార్ విందులో ముస్లీం సోదరులందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము.
తేది : 11.04.2023, సమయం సాయంత్రం గం.04.00
స్థలం : సీకె. కన్వెన్షన్, మంగళగిరి
కింజరాపు అచ్చెన్నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపి అధ్యక్షులు