ప్రజల కోసం చలివేంద్ర ప్రారంభం
సాక్షిత :+గత 23 సంవత్సరాలుగా మజ్జిగ చలివేంద్రం రాజా విక్రమ్ రెడ్డి సహకారంతో
కోవూరు బైపాస్ దగ్గర ఉన్న శ్రీ.షిరిడి సాయిబాబా మందిరంలో ఆ సాయినాధుడికి ఉగాది పర్వదినమున ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.ప్రజలు ఎండ తాపానికి మజ్జిగ చలివేంద్రం పచ్చిపాల “రాజా విక్రమ్ రెడ్డి” అడిషనల్ కలెక్టర్ (రిటైర్డ్) హైదరాబాద్ వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఆలయ ధర్మకర్త పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ముందుగా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
గత 23 సంవత్సరాలుగా మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందని దీనికి దాత పచ్చిపాల శంకర్ రెడ్డి మనవడు పచ్చిపాల రాజా విక్రమ్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ (రిటైర్డ్) హైదరాబాద్ మేము చేస్తున్న ప్రతి సేవా కార్యక్రమంలో లైబ్రరీ అయితే ఏమి, స్మశాన వాటికైతే నేమి, బాలికల స్కూల్ నందు సరస్వతి విగ్రహానికి అయితే నేమి, గుడికి అయితేనేమి, ప్రతిదానికి రాజా విక్రమ్ రెడ్డి సహకరిస్తూ ఉంటారు. వారికి ఆ బాబా ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దేవాలయాన్ని ప్రతిష్టించిన పచ్చిపాల గోపాల్ రెడ్డి, చైర్మన్ పచ్చిపాల సుజాతమ్మ కుటుంబాలు చల్లగా ఉండాలని తెలిపారు.. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్త పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, పచ్చిపాల మల్లికార్జున్ రెడ్డి,శేఖర్ స్వామి జగదీశ్ స్వామి, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY