ఎమ్మెల్యే చొరవతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం..

Sakshitha news

ఎమ్మెల్యే చొరవతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం….. ఎమ్మెల్యే కి, ఇంజనీరింగ్ అధికారులకు ధన్యవాదాలు తెలిపిన కాలనీవాసులు….

125 – గాజులరామారం డివిజన్లోని శివపురి కాలనీలో పెండింగ్లో ఉన్న సిసి రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ఇంజనీరింగ్ అధికారులను ఇటీవల ఆదేశించగా, శివపురి కాలనీలో పర్యటించిన అధికారులు సీసీ రోడ్డు కొలతలను తీసుకొని పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు తెలంగాణ సాయి మాట్లాడుతూ …. బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ కి, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సయ్యద్ రంజాన్, డి.నవీన్ లతో పాటు కాలనీ అధ్యక్షులు బండారి శ్రీధర్ , అడ్వైజర్లు బూర్ల ముకేష్, బూర్ల మహేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్.సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top