నిషేదిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్

Sakshitha news

నిషేదిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్

సుమారు ఒక కోటి పదకొండు లక్షల రూపాయల విలువ గల 222 కిలోల ప్రభుత్వ నిషేదిత గంజాయిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ మరియు అశ్వారావుపేట పోలీసులు

సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ లక్ష్మీ తులసి పేపర్ బోర్డ్ సమీపంలోని జంగారెడ్డి గూడెం రోడ్ నందు విశ్వసనీయ సమాచారం మేరకు కొత్తగూడెం టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు అశ్వారావుపేట పోలీసులు వాహన తనిఖిలు చేపట్టగా, అనుమానాస్పదంగా జంగారెడ్డిగూడెం వైపు నుండి అశ్వారావుపేట వైపు నకు పారిపోతున్న స్విఫ్ట్ డిజైర్ కార్ ను వెంబడించి కొద్ది దూరంలో ఆపి విచారించగా హైదరాబాద్ కు చెందిన A1) ఊంగరాల సరిన్ కుమార్ ( ట్రాన్స్పోర్ట్ ), A2)బెల్లంపల్లికి చెందిన బాబర్ ఖాన్ (ట్రాన్స్పోర్టర్ ) లుగా గుర్తించి వారి కార్ లో ఉన్న 222 కిలోల బరువు గల 111 ప్యాక్కెట్ల నిషేదిత గంజాయిని స్వాదినo చేసుకోవడమైనది. A3)విశాఖపట్నం నకు చెందిన పంగి శ్రీను ( సప్లయర్ ) వద్ద 4 లక్షల రూపాయలకు కొనుగోలు చేసి, A6) మహారాష్ట్ర, నాగపూర్ కు చెందిన ఇంతియాజ్ ( రిసీవర్ ) కు ఎక్కువ మొత్తానికి అమ్మడానికి వెళ్తుండగా పోలీస్ వారు పట్టుకోవడమైనది. స్థానిక సంస్థల ఎన్నికల నేపద్యంలో వాహనాల తనిఖీలు ఎక్కువగా ఉన్నాయని భావించి A1-సరిన్ కుమార్ స్నేహితులైన A-4 హైదరాబాద్ కు చెందిన ఎండీ. ఫీరోజ్ (పిల్లోట్ ) & A5) హైదరాబాద్ కు చెందిన సంతోష్ (పిల్లోట్ )లు ఇట్టి గంజాయి వాహనానికి ఇన్నోవా కార్ ను పైలట్ వాహనంగా కూడా పెట్టుకున్నారు.
గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వాహనాన్ని చాకచక్యంగా పట్టుకున్న అశ్వారావుపేట పోలీసు అధికారులు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

పట్టుబడిన నిందితులపై అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్.250/2025, అండర్ సెక్షన్ : 8(C) r/w 20(b)(ii)(C), 27(A),29 of NDPS యాక్ట్ క్రింద సీఐ నాగరాజు కేసు నమోదు చేయడం జరిగింది. గంజాయిని తరలించడానికి ఉపయోగించిన వాహనం మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు నెం : AP 09 BV 5868, మరియు నిందితులు ఉపయోగించిన సెల్ ఫోన్లు/నగదు: రెండు సెల్ ఫోన్ లు, JIO రూటర్ మరియు, Rs.4000/- రూపాయల నగదును కూడా స్వాదీనం చేసుకోవడం జరిగింది. ఇద్దరు నిందితులు అరెస్ట్ చేయడమైనది, మరో నలుగురు పరారీలో వున్నారు. అరెస్ట్ అయిన వారిలో A1 పై గతములో రెండు ఎన్ డి పి ఎస్ కేసులు కూడా కలవు.

పట్టుబడిన నిందితుల వివరములు

A1). హైదరాబాద్ కు చెందిన ఊంగరాల సరిన్ కుమార్ (ట్రాన్స్పోర్టర్ )

A2). బెల్లంపల్లి కి చెందిన బాబర్ ఖాన్ (ట్రాన్స్పోర్టర్ )

పరారీలో ఉన్న నిందితుల వివరములు

A3). విశాఖపట్నం నకు చెందిన పంగి శ్రీను ( సప్లయర్ )
A4). హైదరాబాద్ కు చెందిన ఎండీ. ఫీరోజ్ (పిల్లోట్ )
A5). హైదరాబాద్ కు చెందిన సంతోష్ (పిల్లోట్ )
A6). మహారాష్ట్ర నాగపూర్ కు చెందిన ఇంతియాజ్ (రిసీవర్ )

వాహన తనిఖీలలో పాల్గొన్న అధికారులు.

టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు మరియు అశ్వారావుపేట సీఐ నాగరాజు, ఎస్సైలు యయాతి రాజు, రామ్మూర్తి మరియు సిబ్బంది పాల్గొన్నారు.