నామినేషన్ లో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త లు తీసుకోవాలి
రిటర్నింగ్ అధికారులను ఆదేశించిన కలెక్టర్
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: తుంగతుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తుంగతుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో తుంగతుర్తి, గానుగబండ, తూర్పుగూడెం సర్పంచ్ లకు, వార్డు సభ్యుల ఎన్నిక నిమిత్తం ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని, మద్దిరాల ఎంపిడిఓ కార్యాలయాన్ని శుక్రవారం కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సందర్శించారు. ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, నామపత్రాలు దాఖలు చేసే విషయంలో అభ్యర్థులకు
ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా సంబనదిత అధికారులను సంప్రదించాలనీ సూచించారు.
తదుపరి మద్దిరాల ఎంపిడిఓ కార్యాలయంలో నామినేషన్ ఆన్లైన్ చేసే విధానాన్ని పరిశీలించారు. నామినేషన్ లను స్వీకరించిన తరువాత వెంటనే టి పోల్ యాప్ లో అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ వేణుమాధవ్,తహసీల్దార్ దయనందం ఎంపిడిఓ లు సత్యనారాయణ రెడ్డి,శేష్ కుమార్, ఆర్ ఓ లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
