బాపట్ల జిల్లా
చెత్త నుంచి దళితులకు విముక్తి జరిగేనా?
కర్లపాలెం మండలంలోని జాతీయ రహదారి వెంట అంబేద్కర్ భవన్ నిర్మాణం కోసం గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే కర్లపాలెం ఏట్రావారి పాలెం పంచాయతీ వారు ఆ అంబేద్కర్ భవన పరిసరాలను డంపింగ్ యార్డ్ గా ఉపయోగిస్తున్నారు. దీనిపై అనేకసార్లు దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ఎవరు పట్టించుకోలేదు. ఈ క్రమంలో భాగంగా బాపట్ల శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారితో అంబేద్కర్ భవన నిర్మాణానికి నిధులు కేటాయింపు చేసి డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలని కోరగా, వెంటనే ఆయన స్పందించి కర్లపాలెం పంచాయతీకి డంపింగ్ యార్డ్ కొరకు వేరే ఒక చోట స్థలాన్ని కేటాయించారు.
అనంతరం అంబేద్కర్ భవన పరిసరాలను శుభ్రం చేయించి మెరక తోలించి ఎంతో సుందరంగా తయారు చేశారు. అయినప్పటికీ ఇంకా అక్కడ ఒక పంచాయితీ వారు చెత్త వేస్తూనే ఉన్నారు. దీనిపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ కు సైతం అంబేద్కర్ భవన పరిసరాలలో చెత్తను వేయకుండా అరికట్టాలని స్పందనలో ఫిర్యాదు చేశారు. అయినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో దళిత సంఘాలు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆందోళన చేయటానికి దళిత సంఘాల సిద్ధమవుతున్నారు. అక్కడ చెత్త వేయకుండా నివారించాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేసి సమస్యను పరిష్కరించుకుంటామని దళిత సంఘాల హెచ్చరిస్తున్నారు.