
కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పిటల్ లోపెద్దస్కాంజరుగుతుంది
మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్
గర్భిణీ స్త్రీల చావులకు కారకులు అవుతున్న కల్వకుర్తి ప్రభుత్వ డాక్టర్లు
మాజీ సర్పంచ్ నిరంజన్ గౌడ్
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటున్న గర్భిణీలు
మాజీ మార్కెట్ చైర్మన్ విజయ్ గౌడ్.
నాగర్ కర్నూలు జిల్లా సాక్షితా ప్రతినిధి
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణం లోని ప్రభుత్వ ఆస్పిటల్ యమలోకాన్ని తలపిస్తుంది. పది సంవత్సరాల నుండి ప్రభుత్వ డాక్టర్ల. నర్సుల నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది గర్భిణీ స్త్రీలు. చిన్నపిల్లలు చనిపోతున్న ఏ ప్రజా ప్రతినిధి పట్టించుకున్న పాపాన పోలేదని ప్రభుత్వ డాక్టర్లకు ఎదురు తిరిగితే వారి సంగతులు అంతే ఇటు ప్రజాప్రతినిధుల అండదండలు అటు అధికారులు అండదండలతో ప్రభుత్వ డాక్టర్లలను నిలదీసిన వారిపై టార్గెట్ చేసి కేసులు చేస్తామని బెదిరించడం అలవాటుగా మారిన ప్రభుత్వ డాక్టర్లు. ఈ విషయంపై మండిపడ్డ మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ ఆయన మాట్లాడుతూ డెలివరీ వస్తే చావులే తప్ప బతికిన పాపనా పోలేదని ప్రభుత్వ హాస్పిటల్ లు పేదలకు అందుబాటులో తేవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఎంపీ మల్లు రవి కల్వకుర్తి పట్టణంలో 100 పడకల హాస్పిటల్ తెచ్చారని కానీ ఉన్న హాస్పిటల్ లో డాక్టర్లు అందరూ ఉన్న కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పిటల్ లో సీరియస్ కేసులను ప్రవేట్ హాస్పిటల్ కు పంపించడమే తమ పనిగా ప్రభుత్వ డాక్టర్లు. అందులో పని చేసే నర్సులు. సిబ్బంది. పెట్టుకున్నారని కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్ ను ప్రైవేట్ హాస్పిటల్ గా మార్చారని డబ్బు సంపాదనే లక్ష్యంగా కొందరు ప్రభుత్వ డాక్టర్లు నర్సులు పనిచేస్తున్నారని.
పేదలకు మాత్రం వైద్యం అందడం లేదని ఎన్నో సంవత్సరాల నుండి ఎంతోమంది గర్భిణీలు. పిల్లలు చనిపోతున్న దానికి కారకులైన డాక్టర్లను నర్సులను తీసివేయడం లేదని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పిటల్ లో ఇది ఒక పెద్ద స్కామ్ గా మారిందని ప్రవేట్ దందా చేసుకునే డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేసే డాక్టర్లకు ప్రైవేట్ హాస్పిటల్లో కల్వకుర్తి పట్టణంలోనే ఉండడంతో వీరు గర్భిణీ స్త్రీలను టార్గెట్ చేసుకొని వారిని భయాందోళనకు గురిచేసి తమ ప్రైవేట్ హాస్పిటల్ లకు పంపించుకోవడం కమిషనర్ల కోసం కొందరు నర్సులు కొందరు ప్రైవేటు వ్యక్తులు కక్కుర్తి పడి ప్రభుత్వ హాస్పిటల్ ను ఒక నరకంలో తయారు చేస్తున్నానని ఈరోజు ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చనిపోయిన శ్యామల చావు ప్రభుత్వ హత్య అని ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డబల్ బెడ్ రూమ్ ఇప్పించాలని ఆమె పిల్లల చదువుల కోసం ప్రభుత్వం సహాయం చేయాలని 50 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. అలాగే కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్లో ఎన్నో సంవత్సరాల నుండి డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల వందల మంది గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు చనిపోతున్న కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేట్ డాక్టర్ల గుప్పెట్లో వెళ్లిందని కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల ప్రాణాలు ఇంకోసారి డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ. ఎంపీ మల్లురవి. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాటుపడాలని అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రతినిధులు కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app