SAKSHITHA NEWS

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం

హైదరాబాద్:
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వర్గం పలు అంశాలపై నేడు కీలక నిర్ణయాలు తీసుకో నుంది. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది.

గత నెల 30నే మంత్రి మండలి భేటీ నిర్వహిం చేందుకు ఏర్పాట్లు చేసి నప్పటికీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణిం చినందున వాయిదా పడింది. రైతు భరోసా విధివిధానాలు, అర్హతలు నేడు ఖరారు కానున్నాయి.

పంట వేసిన వారందరికీ రైతు భరోసా :సుదీర్ఘ సంప్రదింపులు, చర్చల తర్వాత రైతు భరోసాపై కేబినెట్ సబ్​ కమిటీ సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పిం చింది. ఇవాళ మంత్రివర్గం లో చర్చించి, తుది నిర్ణయం తీసుకోనున్నారు.

పంట వేసిన వారందరికీ రైతు భరోసా ఇవ్వాలని, ఆదాయ పన్ను చెల్లింపు, ఎకరాల పరిమితి ఉండొ ద్దని మంత్రివర్గ ఉపసంఘం సూచించింది. రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సిఫార్సు చేసింది.రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు : అ యితే ఒకేసారి రూ.7,500 ఇవ్వాలా లేక ముందుగా రూ.6 వేలు ఇచ్చి క్రమంగా పెంచాలా అనే అంశంపై ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.

భూమి లేని పేదలకు భృతిపై ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త రేషన్ కార్డుల జారీపై కూడా భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డులకు ఆదాయ పరిమి తి దరఖాస్తుల స్వీకరణతో పాటు సన్న బియ్యం పంపి ణీపై కూడా నిర్ణయాలు తీసుకోవచ్చునని సమాచారం.

రేషన్ కార్డులపై సన్నబియ్యం :రాష్ట్రంలో ప్రస్తుతం 89 లక్షల 96 వేల రేషన్ కార్డులు దాదాపు 2 కోట్ల 81 లక్షల లబ్ధిదారులు ఉండగా, సుమారు కోటి 70 లక్షల సన్నబియ్యం అవసరమని అంచనా. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులకు సబ్సిడీ రేట్లతో ఇసుక, సిమెంట్, స్టీలు సరఫరా చేయాలన్న ప్రతిపాదనపై కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేను కేబినెట్ పరిశీలించనుంది. సర్వేలో తేలిన అంశాలపై చర్చించి ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం.


SAKSHITHA NEWS