
భద్రాచలంలో భద్రాది సీతారాములను దర్శించుకున్న బైరెడ్డి, దారపనేని
కనిగిరి సాక్షిత
కనిగిరి నియోజకవర్గం కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పామూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి సోమవారం భద్రాచలంలోని ఆ భద్రాది సీతారాములను దర్శించుకున్నారు. పుణ్య దంపతులైన ఆ సీతారాముల దర్శనంతో కుటుంబంలో ఇంటిళ్లపాది సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెలుగోందుతారని,అందరి బంధువు భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువు, అయోధ్య రామయ్య, అందరికీ చేయూతనిచ్చే సీతారామయ్య, కోర్కెలు తీర్చే కోదండరామయ్య అని భక్తులు అపారమైన నమ్మకంతో భద్రాచలంలోని సీతారాముల వారిని దర్శించుకుంటారని, దారపనేని చంద్రశేఖర్, బైరెడ్డి జయరామిరెడ్డి పేర్కొన్నారు. యడవల్లి వెంకటరెడ్డి, జాజం హరికృష్ణ సీతారాములను దర్శించుకున్న వారిలో ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app