SAKSHITHA NEWS

బుల్లితెర నటి, జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాప్యులారిటీ సంపాదించుకున్న రీతూ చౌదరికి బిగ్ షాక్ తగిలింది.

రూ. 700 కోట్ల ల్యాండ్ స్కాం లో ఆమె అడ్డంగా బుక్‌ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ల్యాండ్ మాఫియాలో రీతు చౌదరికి పేరు బయటకు వచ్చింది. విజయవాడ, ఇబ్రహీంపట్నంకు సంబంధించిన ల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌లో ఆమె అడ్డంగా బుక్కయ్యారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

రీతూ చౌదరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనదైన కామెడీతో మంచి పేరును సంపాదించుకుంది.

అంతేకాదు అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకున్న రీతు చౌదరి కొన్ని వెబ్ సిరీస్ లో కూడా నటించింది. అయితే ప్రస్తుతం ఆమె ల్యాండ్‌ స్కామ్‌లో అడ్డంగా బుక్ అయినట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్, ఇబ్రహీంపట్నం కు చెందిన రూ.700 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి స్కామ్‌లో రీతు చౌదరి పేరు కూడా బయటకు వచ్చింది. ఒక దొంగల ముఠా ఆస్తిని కొట్టేసినట్లు తెలుస్తోంది. ఇందులో పలువురు పెద్ద తలకాయలు కూడా ఉన్నట్లు సమాచారం.

మాజీ సీఎం వైఎస్‌జగన్ సోదరుడు వైఎస్‌ సునీల్, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇందులో నటి రీతూ చౌదరి, చీమకుర్తి శ్రీకాంత్‌పై కూడా ఆరోపణలు ఉన్నాయి. రీతు చౌదరి శ్రీకాంత్ కు రెండో భార్య.

కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా రూ. 700 కోట్ల ఆస్తులను రిజిస్టర్ చేయించుకున్నట్లు సబ్ రిజిస్టర్ ధర్మ సింగ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశాడు. అయితే కేసు కూడా నమోదు అయినట్లు సమాచారం. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది.

ఇక రీతూ చౌదరి అసలు పేరు వనం దివ్య. అసలు ఈ విషయంపై రీతూ అధికారికంగా రియాక్ట్ అయ్యే వరకు తెలీదు.. నిజా నిజాలు ఏంటో రీతు చౌదరి ఎప్పుడు బయట పెడుతుంది అని ఆసక్తి రేకెత్తిస్తుంది.


SAKSHITHA NEWS