విద్యుత్ షాక్ తో గేదె మృతి
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట మండల పరిధిలోని టేకుమట్ల గ్రామంలో 11KV ట్రాన్స్ఫార్మర్ వైర్లు తగిలి పాడిగేదె మృతి చెందింది. గ్రామానికి చెందిన జాల లింగయ్య అనే రైతు 6నెలల క్రితం రూ.82వేలతో గేదెను కొనుగోలు చేశాడు. టేకుమట్లగ్రామ శివారు వెంకటాపురం దారి లోని 11KV ట్రాన్స్ఫార్మర్ కు ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మ ఎత్తు తక్కువగా ఉండడంతో అటుగా వెళ్ళిన గేదే ట్రాన్ఫర్మర్ వైర్లకు తగిలి డిసెంబర్ 12 2024న మృతిచెందింది. 9నెలల క్రితం ఇదే గ్రామానికి చెందిన మహిళా ట్రాన్స్ఫార్మర్ ప్రమాదానికి గురై ప్రాణాలతో బయటపడింది. పశువులు కాస్తూ పాలను అమ్ముకునే కుటుంబం. పాడిగేదే మృతి చెందడం తో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. పశువులపైన ఆధారపడి జీవనం సాగిస్తున్నామని మాకు అధికారులు సహకరించి సాయం చేయాలని రైతు జాల లింగయ్య అధికారులను కోరుతున్నారు.