SAKSHITHA NEWS

వివో ఏల సమస్యలను పరిష్కరించాలి – బిఎస్పీ.

— చిట్యాల మండల ఐకేపీ వీఓఏ ల నిరవధిక సమ్మెకు బిఎస్పి పార్టీ సంఘీ భావం

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

వి ఓ ల సమస్యలను వెంటనే పరిష్కారించాలని బిఎస్పి నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి అన్నారు. చిట్యాల పట్టణ కేంద్రంలో 6వ రోజు శనివారం విఓఏల సమ్మెకు బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి మద్దతు తెలుపుతు మన తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయని ఆశతో పోరాడి తెలంగాణను తెచ్చుకుంటే నిరాశే మిగిలిందని ఎన్నో ఏళ్ల తరబడి గ్రామ స్థాయిలో 200 రూపాయల నెల జీతంతో ఐకెపి వివోఏ లుగా పనిచేస్తున్నప్పటికీ నేటికీ 3900 రూపాయలను పెంచింది అది కూడా మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి ఇస్తూ అనేక రకాలుగా పని ఒత్తిడికి గురిచేసి కనీస వేతనం ఇవ్వకుండా కనీస భద్రత కల్పించకుండా వాళ్ళని వారి కుటుంబాలని రోడ్డు పాలు చేసి కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందిందని కెసిఆర్ కు మాత్రమే నెల జీతం నాలుగు లక్షల పైనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేద ఉద్యోగస్తుల పైన ప్రభుత్వంకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని తెలియజేశారు .రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న వివోఏల సమ్మెకు మద్దతుగా బహుజన సమాజ్ పార్టీ ఉంటుందని తెలియజేశారు ఏదైతే విఏవోలు వారికి కనీస వేతనం 26,000 కేటాయిస్తూ ఉద్యోగస్తులు గుర్తించాలని వారికి ఆరోగ్య భీమా కల్పించాలని వారు చేస్తున్నటువంటి అన్ని డిమాండ్ ను నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున విఓఏ వాళ్లకు మద్దతుగా ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు గ్యార శేఖర్, మండల కోశాధికారి మునుగోటి సత్తయ్య,విఓఏ మండల అధ్యక్షులు ఎదుళ్ల లక్ష్మి, ఉపాధ్యక్షులు గుడిసె పద్మ, బంగాళ వనజ కుమారి, ప్రధాన కార్యదర్శి గుడిసె సువర్ణ, సహాయ కార్యదర్శి పాకల సత్యనారాయణ, దేశపాక సత్తమ్మ, కోశాధికారి వడ్డగానే విజయ బీఎస్పీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS