బీఆర్ఎస్ గెలుపు అభివృద్ధికి మలుపు
ఎంపీ నామ నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయంలో జరిగిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించి, మరింత అభివృద్ధికి చేయూతనివ్వాలని రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు అన్నారు. బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో ఖమ్మం, అశ్వారావుపేట, కొత్తగూడెం, మధిర, పాలేరు, సత్తుపల్లి, వైరా నియోజకవర్గాలకు చెందిన 60 మంది లబ్దిదారులకు మంజూరైన రూ.23,06,000 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్రవారం ఖమ్మం ఎంపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయా మండలాల పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలసి లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా నల్లమల మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్య ఉండి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పని చేస్తున్న నామ నాగేశ్వరరావును రానున్న ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. నామ ముత్తయ్య ట్రస్ట్ ద్వారా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, పేద ప్రజల మదిలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న నామ నాగేశ్వరరావు ను మంచి మెజార్టీతో గెలిపించుకుంటే మరింత అభివృద్ధికి అవకాశం కల్పించినట్లేనని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పధకాలు అమలు చేస్తున్న ఘనత ఒక్క కేసీఆర్ కే దక్కుతుందన్నారు. గతంలో సీఎంఆర్ఎఫ్ సాయం అందరికీ అందేది కాదని, అసలు ఈ పధకానికి ఇంత ప్రచారం కూడా ఉండేది కాదని, తెలంగాణా సాధించుకున్నాక కేసీఆర్ సీఎం అయిన తర్వాతనే ఇంత పెద్ద ఎత్తున ప్రజలకు సీఎంఆర్ఎఫ్ సాయం అందుతుందని అన్నారు.
పార్టీలు, కుల, మతాలకతీతంగా ప్రభుత్వం సాయం అందిస్తున్నదని, సాయం పొందిన వారు కూడా దీనిని గుర్తు పెట్టుకుని, రానున్న ఎన్నికల్లో పని చేసే బీఆర్ఎస్ పార్టీకే తమ ఓటు వేసి, పార్టీ అభ్యర్థులను గెలిపించు కోవాలన్నారు. రైతుబంధు, రైతు బీమ, ఉచిత కరెంట్, ఆసరా పెన్షన్లు వంటి సంక్షేమ పధకాలు ఒక వైపున, మరో వైపు అభివృద్ధిని ముందుకు తీసుకుపోతున్న బీఆర్ఎస్ కు రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో పట్టం కట్టాలని అన్నారు. జిల్లా టెలికం సలహా మండలి సభ్యులు చిత్తారు సింహాద్రి యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ క్యాంప్ కార్యాలయం ఇన్చార్జి కనకమేడల సత్యనారాయణ, వైరా ఎంపిపి వేల్పుల పావని, పార్టీ వైరా, బోనకల్ మండలాల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, చేబ్రోలు మల్లిఖార్జునరావు, కొణిజర్ల మండల నాయకులు పోట్ల శ్రీను, దావ విజయ్ కుమార్, పార్టీ మధిర పట్టణ అధ్యక్షులు పల్లపోతుల వెంకటేశ్వర్లు, రైతుబంధు చింతకాని మండల నాయకులు మంకెన రమేశ్, బోనకల్ మండల నాయకులు ప్రసాద్, రెడ్డిబోయిన ఉద్దండు, అన్నపురెడ్డిపల్లి మండల నాయకులు వీరబోయిన వెంకటేశ్వర్లు, నాయకులు గొడ్డేటి మాధవరావు, వాకదాని కోటేశ్వరరావు, పార్టీ మధిర నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్చార్జి తాళ్ళూరి హరీష్, నామ సేవా సమితి నాయకులు కృష్ణప్రసాద్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.