SAKSHITHA NEWS

కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలిచి భరోసానిచ్చే ఏకైక పార్టీ BRS: వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” ధారూర్ మండల పరిధిలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన BRS పార్టీ కార్యకర్త ఎన్కెపల్లి మహేందర్ ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించగా, వారి కుటుంబ సభ్యులకు BRS పార్టీ ప్రమాద భీమా Rs.2,00,000/- (రూపాయలు రెండు లక్షలు) చెక్కును ఎమ్మెల్యే స్వయంగా కార్యకర్త ఇంటికి వెళ్లి అందించడం జరిగింది.

▪️ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడే నిబద్ధత కలిగిన పార్టీ BRS అని, కార్యకర్తల కుటుంబాలకు తోడుగా ఉంటామన్నారు.

▪️ పార్టీకి సేవ చేసిన కార్యకర్త ఆకస్మికంగా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి పార్టీ పరంగా భరోసనిస్తూ… ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రమాద భీమాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS