SAKSHITHA NEWS

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌ను కలవనున్నారు. ఉదయం 10:30గంట లకు ఇంటి నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌కు ఆమె బయలుదేరనున్నారు.

బెయిల్‌పై విడుదలైన తర్వాత తండ్రిని కలిసేందుకు తొలిసారిగా కవిత వెళుతున్నారు. నిన్న కవిత హైదరాబాద్ చేరుకోగానే ఫోన్ చేసి కూతురుతో కేసీఆర్ మాట్లాడారు. లంచ్‌కు రావాలని కవితని ఆయన ఆహ్వానించారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో అరెస్ట్ అవడంతో ఐదున్నర నెలల పాటు తిహాడ్ జైలులో ఉన్న కవిత ఈ నెల 27న ఆమెకు బెయిల్ లభించింది.


SAKSHITHA NEWS