కుమ్మరి వీధిలో కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేసిన బిఆర్ఎస్ నాయకులు
సాక్షిత వనపర్తి :
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని నాలుగవ వార్డు కుమ్మరి వీధిలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాల ద్వారా ప్రజలకు ఎంత బాకీ ఉన్నారో బిఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన బాకీ కార్డుల ద్వారా
ప్రతి ఇంటి ఇంటికి తిరుగుతూ పంపిణీ చేస్తూ బిఆర్ఎస్ నాయకులు వార్డు ప్రజలకు వివరించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ బాకీ కార్డు(కాంగ్రెస్ బోగస్ కార్డ్) కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు ఇస్తానన్న ఆరు గ్యారెంటీలు ఆరు హామీలను ఇవ్వకుండా ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో వివరిస్తూ 500 కే గ్యాస్ సిలిండర్, వృద్ధులకు, ఒంటరి మహిళకు, బీడీ కార్మికులకు ₹4,000 పెన్షన్ పెంపు, ఇంట్లో ఒకరికి కాదు భార్యాభర్తలకు ఇద్దరికీ పెన్షన్ ఇస్తాం, అదేవిధంగా దివ్యాంగులకు 6000 రూపాయలు పెన్షన్ మరియు మహాలక్ష్మి పథకం కింద గృహినికి 2500 రూపాయలు
కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ తో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తాం అదేవిధంగా రైతులకు 15 వేల రూపాయలు రైతుబంధు, కౌలు రైతులకు 12,000 వేల రూపాయలు, వ్యవసాయ ఉపాధి కూలీలకు 12 వేల రూపాయలు ,18 ఏళ్లు నిండిన మహిళా విద్యార్థులకు స్కూటీలు ,ఆటో డ్రైవర్లకు 12000 వేల రూపాయలు, విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలు ప్రజలకు ఇవ్వకుండా మోసం చేసిందని అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది ఇప్పటికీ 22 నెలలు పూర్తి కావస్తున్న ఏ ఒక్క హామీ ప్రజలకు ఇవ్వకుండా కాలం గడుపుతుంది వీరిపట్ల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పూటకో మాట అబద్ధాలు చెప్పే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాని బొంద పెట్టాలని కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం ఇంటికొస్తే వార్డు ప్రజలు నిలదీయాలని చెప్పారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు సూర్యవంశం ముని కుమార్, సూర్యవంశం గిరి, షేక్ గౌస్, నక్క బాలస్వామి, సుగురు రామస్వామి, బాలరాజు, ఆంజనేయులు, నరేందర్ , శివకుమార్, కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
