ఎఫ్సీఐకి ఎఫ్ సి ఐ కి అప్పగించాల్సిన ధాన్యాన్ని వెంటనే అప్పగించాలని రైస్ మిల్లర్లను ఆదేశించిన ……..అదనపు రెవెన్యూ కలెక్టర్ కిమ్యా నాయక్
సాక్షిత వనపర్తి :
గత ఖరీఫ్, రబీ సీజన్ కు సంబంధించి ఎఫ్.సి.ఐ అప్పగించాల్సిన ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన అప్పగించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్.ఖీమ్య నాయక్ రైస్ మిల్లర్లను ఆదేశించారు.
ఉదయం అదనపు కలెక్టర్ తన ఛాంబర్ లో సివిల్ సప్లై అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశాన్ని నిర్వహించారు.
గత ఖరీఫ్ సీజన్లో రైతుల నుండి ధాన్యం సేకరించి రైస్ మిల్లర్లకు అప్పగించిన వడ్లు ఎన్ని, ఇప్పటి వరకు ఎంత బియ్యం అప్పగించారు అనే వివరాలను సమీక్షించారు.
2024-25 ఖరీఫ్ సీజన్లో జిల్లాలోని మిల్లర్ల నుండి రావాల్సిన సి.యం.ఆర్ ధాన్యం 95,909 మెట్రిక్ టన్నులు కాగా ఇప్పటి వరకు 80,815 మెట్రిక్ టన్నుల ధాన్యం అప్పగించడం జరిగింది. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఇంకా 15,094 మెట్రిక్ టన్నుల ధాన్యం అప్పగించాల్సి ఉంది.
రబీ సీజన్ కు సంబంధించి 1,57,796 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 61,710 మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగించడం జరిగింది. ఇంకా 96,697 మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల నుండి రావాల్సి ఉంది.
గత ఖరీఫ్ సీజన్ కు సంబందించి ఎఫ్.సి.ఐ కి అప్పగించాల్సిన ధాన్యం గడువును నవంబర్ 12 వరకు పొడిగించిన నేపథ్యంలో పెండింగ్ ఉన్న సి.యం.ఆర్ ధాన్యం ఎఫ్.సి.ఐ కు , సివిల్ సప్లై కు అప్పగించాల్సిన ధాన్యం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.
సమీక్ష సందర్భంగా ఒక్కో మిల్లు వారిగా పెండింగ్ వివరాలు వెల్లడించిన అదనపు కలెక్టర్ ఇప్పటి నుండి ప్రతి రోజు రాత్రింబవళ్ళు మిల్లింగ్ చేసి గడువు లోపు ధాన్యం అప్పగించాలని లేని పక్షంలో బ్లాక్ లిస్టు లో ఉంచడం జరుగుతుందని హెచ్చరించారు.
పెండింగ్ ఎక్కువ ఉన్న మిల్లలను తనిఖీ చేసి వడ్లు ఉన్నాయా లేవా ఎ.బి.సి తనిఖీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఎఫ్.సి.ఐ., సివిల్ సప్లై కు అప్పగించాల్సిన ధాన్యం నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని లేని పక్షంలో ధాన్యం రిజెక్ట్ చేయడం జరుగుతుందన్నారు.
ఖరీఫ్ తో పాటు రబీ సీజన్ కు సంబందించిన బియ్యాన్ని సైతం యుద్ధ ప్రాతిపదికన మిల్లింగ్ ఆడించి ధాన్యం అప్పగించాలని ఆదేశించారు. మిల్లింగ్ ఆశించకుండా, బియ్యం అప్పగించకుండా ఎంచేస్తున్నారని మిల్లర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి అప్పగించాల్సిన ధాన్యం అప్పగించకుంటే బ్లాక్ లిస్టులో పెట్టడమే కాకుండా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
జిల్లా సివిల్ సప్లై అధికారి విశ్వనాథ్, డి.యం సివిల్ సప్లై అధికారి జగన్మోహన్, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.
