SAKSHITHA NEWS

మున్సిపల్ అవినీతి ఎజెండాను వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు

కాంగ్రెస్ పాలకవర్గంపై కలెక్టర్లకు ఫిర్యాదు చేస్తామన్న ప్రతిపక్షం

పాత్రికేయుల అవమానం పట్ల చింతిస్తున్నాం అన్న నాయకులు

సాక్షిత వనపర్తి సెప్టెంబర్ 5 మున్సిపల్ కాంగ్రెస్ పాలకవర్గంఅధికారులు కాంట్రాక్టర్ల తో కలిసి అవినీతి ఎజెండాను తయారు చేసిందని మొత్తం కమిషన్ల ఎజెండాగా రూపొందిందని నిరసిస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలో గురువారంఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశం నుండి 9 మంది బి ఆర్ ఎస్ కౌన్సిలర్లు ఇద్దరు కో ఆప్షన్ నెంబర్లు వాకౌట్ చేయడం జరిగిందిఅనంతరం మాజీ చైర్మన్ గట్టు యాదవ్ మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ కౌన్సిలర్ కాగితాల లక్ష్మీనారాయణ మిగతా కౌన్సిలర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలకవర్గం ప్రజలకు ఉపయోగపడే ఎజెండాను కాకుండా అధికారులకు పాలకవర్గ సభ్యులకు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరే విధంగా ఎలాంటి రేట్ కోడ్ లేకుండానే ఈ ఎజెండాను తయారు చేయడం జరిగిందని ఎజెండా పేరుతో దాదాపుగా కోటి రూపాయల అవినీతి చోటుచేసుకుందని ఆరోపిస్తూ ఈ అవినీతి ఎజెండాపై జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు
నిన్న మొన్న దాకా కురిసిన అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను రీస్టార్ట్ చేయకుండానే గుంతలు మయమైన వార్డు రోడ్లలో ఒక్క ట్రిప్పు మొరం కూడా కొట్టకుండా బ్లీచింగ్ పౌడర్లు చల్లకుండా ఇక ఇంజనీరింగ్ సెక్షన్ లో అయితే మిషన్ భగీరథ మంచినీళ్లు బాగానే వస్తున్న వన్ ఇంచ్ పైప్ లైన్, మంచినీటి బోర్ల మరమ్మత్తుల పేరుతో బిల్లులు చేసుకుంటున్నారని ప్రజలకు ఉపయోగపడే పనులపై ఒక పైసా వెచ్చించకుండా మున్సిపల్ కార్యాలయ నిర్వహణకు మాత్రం లక్షలకు లక్షలు బిల్లులు చేసుకోవడం జరుగుతుందని కేవలం ఆఫీస్ కుర్చీల కోసం ఎనిమిది లక్షల బిల్లును ఎజెండాలో పెట్టడం ఆశ్చర్యంగా ఉందని దీన్ని బట్టి పాలకవర్గానికి ప్రజల పట్లచిత్తశుద్ధి ఎంత ఉందో తెలుస్తోందని తాము అధికారంలో ఉన్న లేకపోయినా ఒకటేనని ప్రజల సమస్యల పట్ల ప్రజల ముందుకు తీసుకెళ్లి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ను చేత పనులు చేయించుకోవడానికి పాలకవర్గానికి చేతకాక ప్రభుత్వానికి సరెండర్ చేస్తామన్నడం ఎంతవరకు సరైనదో చెప్పాలని ఒకవేళ పనిచేయకుంటే కలెక్టర్ల చేత వార్నింగ్ ఇప్పించు పని చేయించుకోవాలని అలాకాకుండా కమిషనర్ను సరెండర్ చేయడం పాలకుల అసమర్థతకు చేతకానితనానికి అద్దం పడుతుందని ఏదేవ చేశారు.
పాత్రికేయల అవమానం పట్ల *చింతిస్తున్నాం మాజీ చైర్మన్, వైస్ చైర్మన్లు కౌన్సిల్ సమావేశం లో కౌన్సిల్ సభ్యులతో పాటు సమావేశానికి హాజరైన పాత్రికేయులను ప్రారంభమైన గంట తర్వాత మున్సిపల్ కమిషనర్ పూర్ణచంద్రరావు పాత్రికేయులు అక్కడ ఉన్నారన్న సంగతి ఎవరో గుర్తు చేశారన్న విధంగా సమావేశానికి పాత్రికేయులకు అనుమతులు లేవని సమావేశంలో నుంచి వారు బయటికి వెళ్లాలని పాత్రికేయులను అవమానించడం సరైనది కాదని సమావేశము మొదలైన క్రమంలోని అనుమతులు లేవని తెలిపి ఉంటే బాగుండేదని సమావేశం మొదలైన తర్వాత మధ్యలో బయటికి పంపి అవమానించడం సరైనది కాదని గత సమావేశాలలో వారిని సాదరంగా ఆహ్వానించడం జరిగిందని గుర్తు చేస్తూ పాత్రికేయులకు జరిగిన అవమానం పట్ల చింతిస్తున్నామని మాజీ చైర్మన్ గట్టు యాదవ్ వైస్ చైర్మన్ లుతెలిపారు. కౌన్సిల్ సభ్యులు 33 మంది కి గాను 30 మంది సభ్యులు సమావేశానికి హాజరు కాగా ముగ్గురు కౌన్సిలర్లు మాత్రం గైర్హాజరైనట్లు తెలుస్తోంది ఈ కార్యక్రమంలో చైర్మన్ పుట్టపాకల మహేష్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ మున్సిపల్ కమిషనర్ కో ఆప్షన్ సభ్యులు మున్సిపల్ కమిషనర్ పూర్ణచంద్రరావు మేనేజర్ తో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS