బి ఆర్ఎస్ బాకీ కార్డు ప్రజల బ్రహ్మాస్త్రం, కాంగ్రెస్ గుండెల్లో గుబులు…….. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
…..
*సాక్షిత వనపర్తి *
బి ఆర్ఎస్ బాకీ కార్డు ప్రజల చేతుల్లో బ్రహ్మాస్త్రం అని కాంగ్రెస్ గుండెల్లో గుబులు పుట్టిస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు మంగళవారం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 10,11వార్డులలో(నాగవరం) బి.ఆర్.ఎస్ శ్రేణులతో కలసి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బాకాయి పడ్డ రూపాయలను గుర్తుచేసే బాకీ కార్డులు ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా బి.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు బాకీ కార్డులు ఇంటింటికి పంపిణీ చేయడంతో కాంగ్రెస్ పార్టీ గుండెల్లో గుబులు పుట్టిస్తుందని అన్నారు.
తమ అసమర్థపాలనను కప్పిపుచ్చుకోవడానికి నిత్యం కె.సి.ఆర్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.వ్యక్తిగత దూషణలతో ప్రజాభిమానాన్ని పొందలేరని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేక రోజుకో డ్రామా రేవంత్ రెడ్డి ఆడుతున్నారని దుయ్యబట్టారు.
మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా బకాయి పడ్డ 50000,రైతులకు బకాయి పడ్డ76000,వృద్ధులకు వికలాంగులకు ఫించన్ల ద్వారా బకాయి పడ్డ 44000,ఆటో కార్మికులకు బకాయి పడ్డ 30000,కళ్యాణ లక్ష్మీ ద్వారా బకాయిపడ్డ తులం బంగారం నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు విద్యార్థులకు విద్యా బరోసా విద్యార్థినులకు స్కూటీలు,ధాన్యానికి 500బోనస్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలలో ఓట్లు అడగాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో
వార్డు నాయకులు సుధాకర్ మాజీ సర్పంచ్, పెద్ద ముక్కల.రవి, నందిమల్ల.సుబ్బు, వెంకటేష్ గౌడ్, మన్యం, సత్యం, సంపత్, G హరిబాబు, మండ్ల వెంకటయ్య, మోహన్, కృష్ణయ్య, ఆంజనేయులు, రేగు రాములు, కావలి శంకర్, చంటి, అంజి, నాగరాజు మరియు
జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్, నందిమల్ల.అశోక్, గులాం ఖాదర్ ఖాన్, ఉంగ్లం.తిరుమల్, జోహెబ్ హుస్సేన్, BRS సోషల్ మీడియా అధ్యక్షులు సునీల్ వాల్మీకి, ఉండేకోటి బాలరాజు, కోమరి రాజశేకర్, కోమరి అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
