టీటీడీ బాలమందిరంలో దీపావళి సంబరాలు
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: అనాధ పిల్లలకు ఆశ్రయం కల్పించి, విద్యాభ్యాసం అందించే టీటీడీ బాలమందిరంలో దీపావళి సంబరాలు వైభవంగా జరిగాయి. ఇందులో టీటీడీ బోర్డు సభ్యులు అండ్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గుడిపల్లి భానుప్రకాష్ రెడ్డి పాల్గొని చిన్నారులకు స్వీట్లు పంచారు. పిల్లల మధ్య కాకర వత్తులు, చిచ్చుబుడ్లు, భూ చక్రాలు కాల్చి సంబరాలు జరిపారు. అనాధ చిన్నారులతో కలసి దీపావళి జరుపుకోవడం ఆత్మతృప్తి కలిగిందని భానుప్రకాష్ పేర్కొన్నారు. టీటీడీ తరపున బాలమందిరం పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించే చర్యలు మరిన్ని తీసుకుంటానని హామీ ఇచ్చారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
