SAKSHITHA NEWS

యర్రగొండపాలెం నియోజకవర్గం

సుంకేసులలో ఘనంగా బిఆర్ అంబేద్కర్ జయంతి

పెద్దారవీదు:మండలంలోని సుంకేసుల గ్రామ సచివాలయ ఆవరణంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతిని సర్పంచి గుడ్డెపోగు రమేష్ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గ్రామసభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆర్.పెద్దిరాజు,ఉప సర్పంచి కోటకొండ నాగమణి కోటేశ్వరరావు,ఎంపీటీసీ భూతపాటి అబ్రావతి,వైసీపీ సీనియర్ నాయకులు ఆవుల నాగిరెడ్డి,వార్డ్ నెంబర్లు మండ్ల పెద్దగాలీం,పందేటి నాగయ్య,నీరుడి యేసుమణి పుల్లయ్య,భూతపాటి చెన్నమ్మ సామేలు,ఫీల్డ్ అసిస్టెంట్ సానికొమ్ము మల్లారెడ్డి, ఎంపియూపి జనరల్ పాఠశాల పిఎంసి చైర్మన్ కొల్లే పోలురాజు, సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు,అంగన్ వాడి సిబ్బంది,వెలుగు సిబ్బంది,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS