SAKSHITHA NEWS

కళాశాల చరిత్రలో సరికొత్త ప్రయోగం!

అపూర్వ సమ్మేళనంలో 8న ఆవిష్కరణ

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

ఈనెల 8 న జరిగే యస్ఆర్ బిజీయన్ఆర్ కళాశాల పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనంలో విలక్షణమైన రెండు పుస్తకాలను ఆవిష్కరించడం జరుగుతుంది. రెండు పుస్తకాలు పూర్వ విద్యార్థుల చరిత్రలో సరికొత్త ప్రయోగం అని చెప్పవచ్చును. సరికొత్త ఆలోచనల ఆవిష్కరణగా ఈ రెండు పుస్తకాలు మన ముందు ఉంటాయి. ఈరెండుపుస్తకాలు రెండు ప్రయోజనాలుతో ఉండనున్నాయి.

అఖండ జ్ఞానజ్యోతి గెంటేల బయోగ్రఫీ

ఈయనే యస్ఆర్ బిజీయన్ఆర్ కళాశాల భూరి విరాళదాత. 1956లోనే లక్షరూపాయలు విరాళం అందజేయడం ద్వారా యస్ఆర్ &బిజీయన్ఆర్ కళాశాల ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. ఆనాడు సేకరించిన 69 ఎకరాల భూమి నేడు ఖమ్మం పట్టణం నడిబొడ్డున ఉండివందల కోట్లు రూపాయల భూమి ప్రభుత్వరంగ సంస్థలకు ఉపయోగపడుతుంది. విద్యాసౌకర్యాలు విస్తరించని ఆరోజుల్లో ఆయన ఇచ్చిన విరాళం ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలలో విద్యావ్యాప్తికి తోడ్పడింది. అలాంటి గొప్ప వ్యక్తి దివంగతుడై 65ఏళ్ళు అవుతుంది.ఇంతకీ ఆయన చరిత్రను భవిష్యత్తు తరాలకు పదిల పరచాలని భావించడంలోనే గొప్ప లక్ష్యం దాగివుంది. ఖమ్మంజిల్లాలో విద్యా విప్లవంకు కారణం అయిన యస్ఆర్ & బిజీ యన్ ఆర్ కళాశాల ఏర్పాటులో కీలక భూమిక పోషించిన గెంటేల నారాయణరావుకు కృతజ్ఞతలు తెలుపుకోవడం కళాశాల పూర్వ విద్యార్థుల వినయపూర్వక లక్ష్యం!అందులో భాగమే,”అఖండ జ్ఞానజ్యోతి గెంటేల నారాయణరావు”పుస్తకం. ప్రముఖ రచయిత యన్.తిర్మల్ పూర్వ విద్యార్థి మిత్రులుతో కలిసి శోదించిన చరిత్రనే ఈపుస్తకం. మరో వందేళ్ళు గెంటేల నారాయణరావుకు అక్షర జీవంపోయటమే ఈపుస్తకం లక్ష్యం! అరవై పేజీలతో గెంటేల నారాయణరావు పుస్తకంకు అందమైన ముఖచిత్రం ప్రముఖ చిత్రకారుడు కూరెళ్ళ గీశారు. అచ్చులో రావడానికి కళాశాల పూర్వ విద్యార్థి నేదునూరి నర్సింహారావు సహకరించారు. 60పేజీలు ఈపుస్తకం ఆనాటి వాతావరణం, చరిత్రతో మేళవించి రాయడమే కాకుండా ఆయన జీవితం గమనాన్ని తెలిపే ఆనాటిచిత్రాలు సేకరించి అచ్చులో అందివ్వడం జరుగుతుంది. ఆయనకాలంలో జీవించిన కొందరు ఇంటర్వ్యూలు, బందువుల నుంచి, పాలి వారినుంచి సేకరించిన సమాచారం ప్రోది చేసి ఆయన జీవితం అక్షరీకరించడం జరిగింది. గెంటేల నారాయణరావు జీవిత చరిత్ర ఆదునిక ప్రభుత్వాలకు సైతం విద్యా ప్రాదాన్యతను గుర్తింపు చేసేదిగా ఉంది.మానవవనరును బలోపేతం చేసే విద్యా వికాసం ప్రాదాన్యత గుర్తింప జేస్తుంది.

చదువులమ్మ ఒడిలో…జ్ఞాన”కాలం”!!

ఈపుస్తకం ఓ విలక్షణమైన ఆలోచనగా చెప్పుకోవచ్చు!గత70ఏళ్ళ యస్ఆర్ &బిజీయన్ఆర్ కళాశాల పోకడలను, అబివృద్ధిని, ఉద్యమాలు, ఆలోచనల సంఘర్షణను, అద్బుతం అయిన ఆవిష్కరణగా ఒక నాటి పూర్వ విద్యార్థుల మాటల్లో అనుభూతి కలుగుతుంది. ఒకరకంగా కళాశాల పూర్వ చరిత్రను కొంత ఈపుస్తకం ఆవిష్కరిస్తుంది. అంతే కాదు నాటి తరాలు, నేటితరాల ఆలోచనలు మద్య ఉన్న తేడాలను, ఆదర్శాలను, రాజకీయాలను పట్టిచూపుతుంది. 37మందికళాశాల పూర్వ విద్యార్థుల అనుభూతి, జ్ఞాపకాలు ఈపుస్తకం రికార్డు చేసింది. అందినమేరకు కళాశాల విద్యార్థుల గ్రూపు పోటోలు, ముఖ్యమైన సంఘటనల సమాహారం ఈ పుస్తకం.ఇది ఒకరకంగా నూతన ప్రయోగం అని చెప్పవచ్చును. సమాజంలో తరిగి పోతున్న మానవీయ విలువలు వెన్ను తట్టి లేపే ఈపుస్తకం చదువుతుంటే ఆనాటి అనుభూతి, జ్ఞాపకాలు వెల్లువ మనలను ఆసాంతం తడిపేస్తుంది. ఆనాటి సంఘటనలు సమాహారం! ఆనాటి విలువలు ప్రొది!! సరికొత్త ఆలోచనలకు మార్గ దర్శకం ఈపుస్తకం!!!.120పేజీలు, అందమైన ముఖచిత్రంతో రూపు దిద్దుకున్న “చదువులమ్మ ఒడిలో… జ్ఞాప”కాలం”!! నిజంగా విలక్షణ ప్రమాణాలతో రూపుదిద్దుకున్నది. సంపాదకవర్గం పుస్తకం కూర్పు కోసం ఏర్పడినప్పటికీ చెప్పిన అబిప్రాయం చెడకుండా ఎడిటింగ్ చేసి అందించిన తీరు అద్బుతం!! పుస్తకంచదువుతుంటే అనుభూతి, జ్ఞాపకాలు మనలను వెన్నాడుతుంటాయి. మరోమారు మనలను కళాశాల ప్రాంగణంలో నిలబెడతాయి. సామాజిక విప్లవం కోసం కళాశాల విద్యార్థులు పడ్డ తపన కళ్ళకు కడుతుంది. ఒకరకంగా పాక్షికంగానైనా కళాశాల విద్యార్థుల ఉద్యమాలు, విద్యా చరిత్రను స్థిరీకరించే ప్రయత్నం కనబడుతోంది. సెప్టెంబర్ 8న ఆవిష్కరణ జరుపుకుంటున్న ఈరెండు పుస్తకాలు ఆవిష్కరణ అనంతరం కళాశాల పూర్వ విద్యార్థి సంఘం సభ్యులకు అందించబడతాయి. ఏది ఏమైనా వినూత్న మైలు రాళ్ళు పాతుతూ, విలక్షణమైన రెండు పుస్తకాలు ఈసందర్భంగా అందించబడతాయి. యస్ఆర్&బిజీయన్ఆర్ కళాశాల ఔన్నత్యాన్ని పెంచే దిశగా రెండు విలక్షణ మైన పుస్తకాలు ఆవిష్కరణ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనంలో జరుగుతుంది. ఈరెండు పుస్తకాలు పూర్వ విద్యార్థుల సంఘం అపూర్వ ప్రయోగం ఫలితంగా రూపుదిద్దుకున్న విషయం స్పష్టం కానుంది. రెండు విలక్షణ ప్రయోగంతో కూడుకున్న పుస్తకాలు కోసం సెప్టెంబర్ 8 వరకు వేచిచూద్దాం.అక్షరాబిశేఖంతో పులకించి పోదాం.


SAKSHITHA NEWS