SAKSHITHA NEWS

Bonal: Dhoom Dham in Hyderabad from July 7

జూలై 7 నుంచి హైదరాబాద్ లో బోనాల్: ధూం ధామ్

హైదరాబాద్:
నగరంలో జులై 7 నుంచి బోనాలు వేడుకలు జరుగ నున్నాయి. గోల్కొండలోని జగదాంబికా గుడిలో మొదలు కానున్నది.

హిందువుల క్యాలండర్ ప్రకారం ఆషాడంలో బోనాలు మొదలవుతాయి. ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారికి మొక్కులు చెల్లించడం జరుగుతుంది. భక్తులు అమ్మవారికి నైవేద్యం పెడతారు. అలంకరించిన కుండల్లో సమర్పిస్తారు.

హైదరాబాద్ నగరంలో ప్రతి ఏడాది బోనాలు మూడు దశలలో జరుగుతుంది. వాటిని గోల్కొండ బోనాలు, లష్కర్ బోనాలు, ఉజ్జయినీ మహంకాళి బోనాలు అని జరుపుకుంటారు.

హైదరాబాద్ లోని హరీబౌలి లో ఉన్న శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి గుడి, లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి గుడిలో బోనాల ఉత్సవాలు ముగుస్తాయి. 150 ఏళ్ల క్రితం కలరా మహమ్మారి రావడంతో తొలిసారి ఈ బోనాలు పండుగ వేడుకలు జరుపుకున్నారని చరిత్ర చెప్తుంది…

మహంకాళి అమ్మవారి ఆగ్రహం కారణంగానే నాడు కలరా వ్యాపించిందని ఓ నమ్మకం. అప్పటి నుంచి అమ్మవారికి బోనాలు వేడుకలు జరుపుకుంటు న్నారు హైదరాబాద్ నగర ప్రజలు…

WhatsApp Image 2024 06 14 at 18.50.58

SAKSHITHA NEWS