మరోమారు ఆశీర్వదించండి
మరింత అభివృద్ధికి కృషి:
శేరిగూడ గ్రామ సర్పంచ్ అభ్యర్థి బొల్లారం నివేదిత ఇంద్రసేనారెడ్డి
శంకర్‌పల్లి:
గ్రామస్తులందరి సహకారంతో గత ఐదు ఏళ్లు తన భర్త ఇంద్రసేనారెడ్డి ఉప సర్పంచ్ గా పనిచేసి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. మరోమారు ఆశీర్వందించండి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని శేరిగూడ గ్రామ సర్పంచ్ అభ్యర్థి బొల్లారం నివేదిత కోరారు. సర్పంచ్ ఎన్నికల ప్రచారం భాగంగా గ్రామంలో తన మద్దతుదారులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించి కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.
సర్పంచ్ గా గెలిపించి గ్రామానికి సేవ చేసే అవకాశం కల్పించాలని, ఆమె ర్యాలీ నిర్వహించి ఓటర్ల వద్దకు వెళ్లి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అవకాశం ఇస్తే అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజలే తన బలగం గ్రామ అభివృద్ధి చేయమన్నారు. ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేసే నాయకులకే ఓటు వేసి గెలిపించాలని కోరారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
