SAKSHITHA NEWS

మోకిల గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎల్లయ్యను సన్మానించిన బిజెపి, కాంగ్రెస్ నాయకులు

శంకర్‌పల్లి: ఆగస్టు 30: మోకిల గ్రామ పంచాయతీ సెక్రటరీగా సి.ఎల్లయ్య ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఎల్లయ్య కొండకల్ గ్రామ పంచాయతీ సెక్రటరీ గా విధులు నిర్వహిస్తుండగా పై అధికారులు ఎల్లయ్య కి అదనంగా మోకిల గ్రామ పంచాయతీ సెక్రటరీగా నియమించారు. శుక్రవారం శంకర్‌పల్లి మండల బిజెపి ఉపాధ్యక్షుడు వెంకటేష్, మోకిల గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యం.. ఎంపీడీవో వెంకయ్య గౌడ్, పంచాయతీ సెక్రెటరీ ఎల్లయ్యలను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఓ జయరాజ్ ఉన్నారు.


SAKSHITHA NEWS