టీడీపీ నేత “పులుగోరు” జన్మదిన వేడుకలు
** పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ పులుగోరు మురళీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలను తిరుపతిలో కూటమి నాయకులు, పులిగోరు యువసేన, అభిమానులు స్నేహితులు ఘనంగా నిర్వహించారు. పులిగోరు మురళీ కృష్ణారెడ్డికి పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, టిడిపి, బిజెపి, జనసేన పార్టీలకు చెందిన నాయకులు ఫోన్ల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
నగరంలోని పలుచోట్ల ఆయన పేరిట కేక్ కట్ చేసి పంచిపెట్టారు. శ్రీనివాసం సముదాయం వద్ద వెయ్యి మంది పేదలకు, భక్తులకు పులిగోరు మురళీకృష్ణ రెడ్డి పేరిట తెలుగు యువత నేత శరత్ చౌదరి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా “శాప్” చైర్మన్ అనిమిని రవి నాయుడు, టిడిపి సీనియర్ నేత జేబీ శ్రీనివాస్, శ్రీ తాతయ్య గుంట గంగమ్మ గుడి చైర్మన్ నైనార్ మహేష్ యాదవ్ ల చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పులిగోరు మురళీ కృష్ణారెడ్డి పుట్టినరోజులు పురస్కరించుకొని గత 20 ఏళ్లుగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు, పేదలకు బట్టల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నామని చెప్పారు. ఈ పుట్టినరోజు వేడుకలలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు హేమంత్ యాదవ్, దొడ్డా రెడ్డి రామకృష్ణారెడ్డి, గంగమ్మ గుడి మాజీ చైర్మన్ చింతా భరణి యాదవ్, భారతి, జానా రామకృష్ణ, కూటమి నాయకులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY