SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా వెనుకబడ్డ పశ్చిమ ప్రాంతమైన భైరవకోన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నూకసాని కి బైరెడ్డి విజ్ఞప్తి

కనిగిరి సాక్షిత

కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు మోరుబోయిన గంగరాజు యాదవ్, అష్రఫ్ రైస్ ట్రేడర్స్ అధినేత షేక్ చిన హాజీ మలన్ ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ ని జిల్లా టిడిపి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలవతో సన్మానించి పుష్పగుచ్చంతో సత్కరించారు. ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు భైరవకోన, మోపాడు రిజర్వాయర్ లను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని, నిధులు మంజూరు చేయాలని కోరారు. నూకసాని బాలాజీ స్పందిస్తూ భైరవకోన అభివృద్ధికి 50 లక్షల రూపాయలతో డిపిఆర్ పర్యాటక శాఖ కమిషనర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగినదని, అనుమతులు వచ్చిన వెంటనే కార్యాచరణ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని బైరెడ్డి తెలిపారు. అదేవిధంగా మోపాడు రిజర్వాయర్ పర్యాటక కేంద్రంగా , బోట్ షికార్, మరియు రిసార్ట్స్ కు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారని బైరెడ్డి తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app