SAKSHITHA NEWS

🙏🪷పత్రికా ప్రచురణార్థం🪷🙏
నెహ్రూనగర్ గ్రామం, గోస్పాడు మండలం, నంద్యాల జిల్లా నుండి.

తేదీ 26-05-2023.

భాగవతం సాక్షాత్కరించిన భగవత్స్వరూపం

భక్తి పరిపక్వత చెందాలంటే ప్రతి మనిషి భాగవతం చదవాలని, భాగవతం సాక్షాత్కరించిన భగవత్స్వరూపమని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గోస్పాడు మండలం, నెహ్రూనగర్లోని శ్రీ రామాలయం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ప్రతిరోజు భజనలు, డాక్టర్ దోనేపూడి నరేశ్ బాబుచే శ్రీమద్రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై ప్రవచనాలు భక్తులను ఎంతగానో అలరించాయి. కార్యక్రమాల ముగింపు సందర్భంగా గ్రామంలోని ముత్తైదువులచే వేదపండితులు ఆమంచి వెంకటేశ్వరశమ్మచే గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు భాగవతం లోని భక్తితత్త్వాన్ని గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తియ్యగూర శివరామిరెడ్డి, శ్రీ రామాలయ ధర్మకర్త దిగుపాటి కృష్ణారెడ్డి, శివాలయం ధర్మకర్త తాడి వెంకట సుబ్బారెడ్డి, భజన మండలి అధ్యక్షులు నల్లల జనార్ధన రెడ్డి, వేంకటేశ్వర రెడ్డి, తాడి పక్కీరారెడ్డి, ద్వారం కొండారెడ్డి, గోపిరెడ్డి నాగిరెడ్డి, పెసల కొండారెడ్డి, బి.శ్రీనివాసులు రెడ్డి, మందా లక్ష్మీదేవి, దిగువపాటి వెంకటలక్ష్మి, సరోజ, టి.కొండమ్మ, దుర్గమ్మతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS