ఊరెళుతున్నారా జాగ్రత్త : భద్రాద్రి ఎస్పీ
సాక్షిత :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
వరుస సెలవులు వస్తుండటంతో దూర ప్రాంతాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, ఇదే అదునుగా చూసుకొని దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారని భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. ఆగస్ట్ 15, 16, 17 తేదీలలో వరుస సెలవులు నేపాధ్యంలో చోరీల నియంత్రణకు అన్నీ చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మీకు వీలయినంతవరకు విలువైన వస్తువులు ఆభరణాలు మీ వెంట ఉంచుకోవడం శ్రేయస్కరమని తెలిపారు.అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు.
