SAKSHITHA NEWS

mosquito bite 124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మచెరువులో గుఱ్ఱపుడెక్క పెరిగి దోమల బెడద ఎక్కువగా ఉందని పరిసర ప్రాంతాల ప్రజలు సమస్యను స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ ఎంటమాలజీ సిబ్బందితో కలిసి ఆకు తొలగించే యంత్రం సహాయంతో గుఱ్ఱపుడెక్క ను తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ దోమల నివారణలో భాగంగా ఎల్లమ్మచెరువు లో ఉన్న గుఱ్ఱపుడెక్క ను తొలగించడం జరుగుతుంది అన్నారు. గుఱ్ఱపుడెక్క వల్ల దోమలవ్యాప్తి విపరీతంగా పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్నారు. గుఱ్ఱపుడెక్కను తొలగించి చెరువును శుభ్రం చేస్తే దోమల బెడద తగ్గుతుందని తెలిపారు. ప్రజలు కూడా తమవంతు బాధ్యత వహించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ కవర్లు, వ్యర్ధాలు చెరువులో కానీ నాలాలో కానీ వేయొద్దని స్థానిక ప్రజలను కోరారు. చెత్తను వీధుల్లోనూ కాలువలోను కాకుండా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చెత్త సేకరించే ఆటోలలో మాత్రమే వేయాలని సూచించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ మీ ఇంటి దగ్గరికి వచ్చే ఎంటమాలజీ సిబ్బందికి సహకరించాలని అన్నారు. అదేవిధంగా ఇంటి పరిసరాల్లో ఎక్కువ రోజులు నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, బాలస్వామి, రాజుగౌడ్, ఎంటమాలజీ సూపర్వైజర్ డి.నరసింహులు, ఎంటమాలజీ సిబ్బంది పాల్గొన్నారు.

mosquito bite

SAKSHITHA NEWS