టీటీడీ ఈఓకు శుభాకాంక్షలు
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ కు టీటీడీ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు కట్టమంచి ఇందిర దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఈఓను తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో కలిసి దీపపు ప్రమిదలతో స్వీట్లు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు. టీటీడీలో మహిళా ఉద్యోగుల సమస్యల పట్ల గతంలో కూడా ఈఓగా అనేక చర్యలు సానుకూలంగా తీసుకున్నారని సింఘాల్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఉన్న టీటీడీ మహిళా ఉద్యోగుల సమస్యలు, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ / సొసైటీ ఉద్యోగుల సమస్యలు కూడా త్వరగా పరిష్కరించి ఆదుకోవాలని కట్టమంచి ఇందిర ఈఓకు విన్నవించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
