SAKSHITHA NEWS

భరోసా ఉన్న మహిళాగా ఉండండి..

ఉచిత రొమ్ము క్యాన్సర్ పరీక్ష మరియు అవగాహన శిబిరం కార్యక్రమంను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గాగిల్లాపూర్ లోని గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రాన్యూల్స్ కంపెనీ మరియు ఏఐజీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత రొమ్ము క్యాన్సర్ పరీక్ష మరియు అవగాహన శిబిరంను జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమంను ప్రారంభించిన పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ .. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ ఇంతటి చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్న గ్రాన్యూల్స్ మరియు ఏఐజీ హాస్పిటల్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. మొబైల్ ఉమెన్ క్యాన్సర్ స్క్రీన్ సెంటర్ ను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.. ఈ సేవలు విస్తరించాలని వారు ఆకాంక్షించారు. తనవంతు సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కుంటి అరుణ నాగరాజు, కొర్ర శంకర్ నాయక్, సుధాకర్ రెడ్డి, భరత్ కుమార్, డియంహెచ్వో డా.రఘునాథ్ స్వామి, గ్రాన్యుల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమా చిగురుపాటి, ఏఐజీ హాస్పిటల్ డా.ప్రజ్ఞా చిగురుపాటి, సీనియర్ నాయకులు మోర అశోక్, యువ నాయకులు విష్ణు యాదవ్, ఉపాధ్యాయులు రాజేష్, మరియు డాక్టర్లు, ఆశా వర్కర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు…..


SAKSHITHA NEWS