బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన బీసీ సంఘాలు
సాక్షిత తుంగతుర్తి ప్రతినిధి: స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీసీ లకు చెందాల్సిన రిజర్వేషన్ విషయంలో జరుగుతున్న అన్యాయానికి రేపు జరగబోయే బంద్ కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూన్నామని పస్తాల బీసీ సంఘాలు తెలియజేశాయి.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు పులుసు హుస్సేన్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ 42 శాతం కల్పిస్తూ చేసిన తీర్మానాన్ని సవాలు చేస్తూ అగ్రకులాల వారు, మనకు రావాల్సిన రాజకీయ హక్కులను వారే అనుభవిస్తూ బీసీలను ఇంకా రాజకీయంగా అణచివేస్తున్నారని అన్నారు, బీసీలు అందరూ ఏకమై మనకు రావాల్సిన రిజర్వేషన్ లను, హక్కులను కాపాడుకునేందుకు ఇదే సరైన సమయమని , అలాగే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తప్పకుండా 42 శాతం రిజర్వేషన్ లను కల్పించాలని ప్రభుత్వం, అలాగే ప్రతిపక్షం చేస్తున్న ఈ బంద్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కందగట్ల అంజయ్య , లోడే హరి గారు, నాతి వెంకన్న , కట్ల శ్రీను , నాతి యాదయ్య , పోగుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
