‘బనారస్‌’ మిస్టీరియస్ లవ్ స్టొరీ.. కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ ప్యాకేజీ

SAKSHITHA NEWS

‘బనారస్‌’ మిస్టీరియస్ లవ్ స్టొరీ.. కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ ప్యాకేజీ :  ‘బనారస్‌’ చిత్ర యూనిట్  

కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘బనారస్‌’ తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.  భారీ స్థాయిలో తెరకెక్కుతున్న బనారస్ నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానుంది. ‘నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం విలేఖరులు సమావేశం హైదరాబాద్ లో నిర్వహించారు.

జైద్ ఖాన్ మాట్లాడుతూ .. తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు మాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. మొన్న జరిగిన వైజాగ్ ఈవెంట్ లో మాపై ఎంతో అభిమానం కురిపించారు. ఈ అభిమానం, ప్రేమ నేను ఊహించలేదు. తెలుగు ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి వుంటాను. నవంబర్ 4వ  ‘బనారస్‌’  ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘బనారస్‌’ మిస్టీరియస్, మెచ్యూర్ లవ్ స్టొరీ. యాక్షన్ కామెడీ థ్రిల్ సస్పెన్స్ ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ వుంటాయి. ఇందులో ఒక వినూత్నమైన ప్రయోగం చేశాం. అది ప్రేక్షకుడు గుర్తుపెట్టుకునేలా వుంటుంది. చాలా ఫ్రెష్ కంటెంట్ వున్న సినిమా బనారస్. సినిమాని తెలుగులో విడుదల చేస్తున్న సతీష్ గారికి కృతజ్ఞతలు.  నవంబర్ 4వ అందరూ థియేటర్ కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి” అని కోరారు.

సోనాల్ మాంటెరో మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు మాకు ఎంతో గొప్పగా ప్రోత్సాహం ఇస్తున్నారు. ముందుకు తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోహిస్తున్నాను. అందరికీ కనెక్ట్ అయ్యే పాత్ర ఇది.  సతీష్ గారు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. నవంబర్ 4న సినిమా విడుదలౌతుంది. మీ అందరి ప్రేమ, అభిమానం కావాలి” అని కోరారు.

సతీష్ వర్మ మాట్లాడుతూ.. బనారస్ బలమైన కంటెంట్ వున్న చిత్రం. ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాం. నవంబర్ 4న సినిమా విడుదలౌతుంది. అందరూ థియేటర్ లో సినిమా చూసి ఆదరించాలని కోరారు.  

తారాగణం: జైద్ ఖాన్, సోనాల్ మాంటెరో, సుజయ్ శాస్త్రి, దేవరాజ్, అచ్యుత్ కుమార్, సప్నా రాజ్, బర్కత్ అలీ  తదితరులు

సాంకేతిక విభాగం
రచన,  దర్శకత్వం: జయతీర్థ
నిర్మాత: తిలకరాజ్ బల్లాల్
బ్యానర్: ఎన్ కె ప్రొడక్షన్స్
సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్
డీవోపీ: అద్వైత గురుమూర్తి
యాక్షన్: ఎ వుయి, డిఫరెంట్ డానీ
డైలాగ్స్: రఘు నిడువల్లి
లిరిక్స్ : డా.వి.నాగేంద్రప్రసాద్
ఎడిటర్: కె ఎం ప్రకాష్
ఆర్ట్: అరుణ్ సాగర్, శీను
కొరియోగ్రాఫర్: జయతీర్థ, ఎ హర్ష
పోస్ట్ సూపర్‌వైజర్ – రోహిత్ చిక్‌మగళూరు
కాస్ట్యూమ్: రష్మీ, పుట్టరాజు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వైబి రెడ్డి
ప్రొడక్షన్ కంట్రోలర్: చరణ్ సువర్ణ, జాకీ గౌడ
పబ్లిసిటీ డిజైన్: అశ్విన్ రమేష్
పీఆర్వో : వంశీ-శేఖర్


SAKSHITHA NEWS

SAKSHITHA NEWS

Related Posts

years 32 సంవత్సరాలు వెనక్కి వెళితే,

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSyears 32 సంవత్సరాలు వెనక్కి వెళితే,మద్రాసు మహానగరం లోని ఒక సాధారణమైన అద్దె ఇల్లు. ఒకప్పుడు లెక్కపెట్టకుండానే అడిగినవారికి లక్షల్లో దానం చేసిన ఆ ఇంట్లోని బంగారు చేతులు, రోజువారి జీతం కోసం ఎదురుచూస్తున్ననమ్మలేని రోజులు.థడ్…థడ్…అని తలుపు చప్పుడు. years…


SAKSHITHA NEWS

కల్కి.. 4 రోజుల్లో రూ.555 కోట్ల కలెక్షన్లుkalki

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSకల్కి.. 4 రోజుల్లో రూ.555 కోట్ల కలెక్షన్లుkalkiకల్కి 2898AD మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. 4 రోజుల్లో ₹555 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. హిందీ వెర్షన్ రికార్డు స్థాయిలో ₹115 కోట్లు సాధించినట్లు…


SAKSHITHA NEWS

You Missed

uttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి

uttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం

varla వర్ల కుమార్ రాజా గెలుపుతో పామర్రు నియోజకవర్గానికి మహర్దశ

varla వర్ల కుమార్ రాజా గెలుపుతో పామర్రు నియోజకవర్గానికి మహర్దశ

tamil nadu తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?

tamil nadu తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?

godavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు

godavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు

constitution రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ ఫిరాయింపులను

constitution రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ ఫిరాయింపులను

You cannot copy content of this page