SAKSHITHA NEWS

బాలగోపాల్‌ సోదరి మాధవి కన్నుమూత..

మానవహక్కుల ఉద్యమంలో క్రియాశీల పాత్ర

ప్రముఖ మానవహక్కుల ఉద్యమనేత బాలగోపాల్‌ పెద్ద చెల్లెలు పి.మాధవి (70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం తుదిశ్వాస విడిచారు. సికింద్రాబాద్‌లోని కస్తూర్భాగాంధీ మహిళా కళాశాలలో మాధవి కామర్స్‌ అధ్యాపకురాలిగా సుదీర్ఘకాలం సేవలందించారు. పీవోడబ్ల్యూ తొలితరం నాయకురాలిగా స్త్రీల హక్కుల పోరాటాల్లో పాల్గొన్నారు. ఏపీసీఎల్సీ, మానవహక్కుల వేదికల్లోనూ క్రియాశీలపాత్ర పోషించారు. మానవ హక్కులకు సంబంధించిన పలు పుస్తకాలను తెలుగులోకి అనువదించారు.

అమెరికాలో స్థిరపడిన మాధవి కుమారుడు ఆదిత్య మంగళవారం స్వదేశానికి రానున్నారు. బుధవారం ఉదయం వరకు చిక్కడపల్లిలోని స్వగృహంలో బంధు, మిత్రుల సందర్శనార్థం మాధవి భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అదేరోజు మధ్యాహ్నం బన్సీలాల్‌పేట శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మానవ హక్కుల ఉద్యమంలో మాధవి పాత్రను పీవోడబ్ల్యూ సంధ్య, సజయ తదితరులు గుర్తుచేసుకొన్నారు.. కేపి


SAKSHITHA NEWS