SAKSHITHA NEWS

నిబంధనలను గాలికి వదిలేసిన మల్కాజిగిరిలోని బేకరీలు

సాక్షిత : మల్కాజిగిరి..కుళ్ళిపోయిన ఆహార పదార్థాలను వినియోగదారులకు సరఫరా చేస్తున్న మల్కాజ్గిరి లోని బ్రౌన్ బేర్ బెకరీ నిర్వాహకులు.
బర్గర్ లో కుళ్ళిపోయిన చికెన్ వేసి వేడి చేసి కస్టమర్లకు పంపిణీ చేస్తున్నట్టు బాధితులు తెలిపారు. దీనిపై మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు బాధితుడు తెలిపారు.
సాధారణంగా బేకరీలలో చిన్నపిల్లలు, యువకులు ఎక్కువగా తింటుంటారు. కానీ డబ్బుల కోసం కొంతమంది రెస్టారెంట్లు, బేకరీ లలో సరైన నాణ్యత లేని కూలిపోయిన ఆహార పదార్థాలను వినియోగదారులకు అమ్ముతున్నారు.

వీటిని పట్టించుకోవాల్సిన జిహెచ్ఎంసి అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. దీంతో హోటల్లు, బేకరీలు, రెస్టారెంట్లు వారికి నచ్చినట్లుగా నిబంధనలు గాలికి వదిలి కూలిపోయిన ఆహార పదార్థాలు ప్రజలకు అమ్ముతున్నారు. అసలే వర్షాకాలం కావడంతో ఇటువంటి ఆహార పదార్థాలు తిన్న ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. ఇప్పటికైనా జిహెచ్ఎంసి అధికారులు స్పందించి ఇటువంటి హోటల్లు, బేకరీలు, రెస్టారెంట్లపై దాడులు జరిపి వాటిని సీజ్ చేయాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు..

WhatsApp Image 2024 08 20 at 19.00.11

SAKSHITHA NEWS