మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కి బాచుపల్లి శ్రీ ముత్యాలమ్మ దేవి

Sakshitha news

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కి బాచుపల్లి శ్రీ ముత్యాలమ్మ దేవి, దుండిగల్ శ్రీ రాజరాజేశ్వరి దేవి,శ్రీ పోచమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానన్నీ అందజేశారు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తన నివాసం వద్ద రోజువారి కార్యాచరణలో భాగంగా నియోజకవర్గం ప్రజలతో కలిసి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు..

అనంతరం బాచుపల్లి బాచుపల్లి శ్రీ ముత్యాలమ్మ దేవి బోనాల జాతర, తోట్టెల కార్యక్రమంలో ముఖ్యతిధిగా పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానన్నీ అందజేశారు.

— దుండిగల్ శ్రీ రాజరాజేశ్వరి దేవి,శ్రీ పోచమ్మ తల్లి బోనాలు,ఫలహారం బండి కార్యక్రమంలో ముఖ్యతిధిగా పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానన్నీ అందజేశారు..

— జాతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ముఖ్యతిధిగా పాల్గొనాలని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ NSUI మాజీ అధ్యక్షులు కూన రాఘవేందర్ గౌడ్ కు నియోజకవర్గం యువజన కాంగ్రెస్ నాయకులు ఆహ్వానాన్ని అందజేశారు..

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆహ్వానాలను స్వీకరించి సానుకూలంగా స్పందించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గోన్నారు..