SAKSHITHA NEWS

మేడ్చల్ మున్సిపాలిటీలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు :- మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు,మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ..!

సాక్షిత ::మేడ్చల్ జిల్లా కేంద్రంలోని మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని మేడ్చల్ పట్టణంలోని ఇందిరా నగర్ కాలనీలోని అంబేద్కర్ భవన్ వద్ద,కిష్టాపూర్ గ్రామంలోని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ.ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా భారత ఉప ప్రధానిగా వ్యవహరించాడని,ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలవాలని ఆయన సేవలను కొనియాడుతూ మహోన్నత వ్యక్తిత్వం కలిగినవారని,ఈ సందర్భంలో ఆయనకు నా నమస్కారాలు తెలియజేస్తున్నానని.బడుగు,బలహీన వర్గాల సంక్షేమం కోసం తన జీవితాన్ని అర్పించిన మహానుభావులు.గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు,పరిపాలన నిపుణుడు అయిన ఆయన,జాతీయ నాయకుడిగా,పార్లమెంట్ సభ్యుడిగా,కేంద్ర మంత్రిగా పనిచేస్తూ అణగారిన తరగతుల అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారని,ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు వేశారని మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దుర్గం శివ శంకర్ ముదిరాజ్,మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి,మేడ్చల్ మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లవంగు రాకేష్ వంజరి,మేడ్చల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉదంండపురం సత్యనారాయణ,మేడ్చల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ,మేడ్చల్ పట్టణ మాజీ ఉప సర్పంచ్ మర్రి నర్సింహ్మ రెడ్డి,మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు జీడిపల్లి రామకృష్ణ,శివ కుమార్,చిట్టి,దుర్గం వెంకటేష్ ముదిరాజ్,రాజశేఖర్ రెడ్డి (బబ్లూ),టైలర్ రాజు గౌడ్,సద్ది సుదర్శన్ రెడ్డి,తుడుం యాదయ్య,పరుశురాం,నవీన్,మహేష్,రమేష్,నాగరాజు,సుధాకర్ అంబేద్కర్ సంఘం నాయకులు మేడ్చల్ పట్టణ పుర ప్రముఖులు,మాజీ ప్రజా ప్రతినిధులు,మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు యువకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.